వెయ్యి రూపాయల కోసమే హత్య
టీ మీడియా ,మే 8,మెదక్: కౌడిపల్లి మండలంలోని తునికి అటవీ ప్రాంతంలో ఈ నెల 4న జరిగిన మాలోత్ సురేష్(32) హత్యకేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వెయ్యి రూపాయల కోసమే నిందితుడు హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన వివరాలను నర్సాపూర్ సీఐ షేక్‌లాల్ మదర్, కౌడిపల్లి ఎస్ఐ శివప్రసాద్‌రెడ్డి శనివారం విలేకరులకు వెల్లడించారు. ఈ మేరకు.. పోలీసులు శనివారం ఘటనా స్థలంలో మరికొన్ని ఆధారాలను సేకరించే యత్నంలో ఉండగా అక్కడే అనుమానాస్పద స్థితిలో తచ్చాడుతున్న చిల్పచేడ్ మండలంలోని అంతారం చెరువు కొమ్ము తండాకు చెందిన కాట్రోత్ శ్రీను ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా తానే హత్య చేసినట్టు అంగీకరించాడు.
Also Read : డబ్బున్న అమ్మాయిలే
గతంలో మాలోత్ సురేష్ నిందితుడైన కాట్రోత్ శ్రీను నుంచి రూ. వేయి అప్పుగా తీసుకుని తిరిగి ఇవ్వలేదు. ఈ విషయమై శ్రీను పలుమార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. ఈ నెల 2న సురేష్ తమ సొంత గ్రామానికి వచ్చే క్రమంలో వైన్స్ వద్ద శ్రీనుతో కలిశాడు. ఇరువురు మద్యం సేవించేందుకు తునికి అటవీ ప్రాంతానికి ద్విచక్రవాహనంపై వచ్చి మద్యం సేవించారు. అనంతరం తనకు ఇవ్వాల్సిన రూ. వేయి అప్పు గురించి శ్రీను అడుగగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో సురే్‌షను కొట్టి తలపై బండరాయితో మోది తానే హత్య చేసినట్లు శ్రీను అంగీకరించాడు. హత్య కేసును ఛేదించిన ఏఎ్‌సఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ భాగయ్య, సురే్‌షలను సీఐ అభినందించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube