కులోన్మాద హ‌త్య విష‌యంలో పోలీసుల పురోగ‌తి

ఐదుగురు నిందితుల అరెస్ట్

1
TMedia (Telugu News) :

కులోన్మాద హ‌త్య విష‌యంలో పోలీసుల పురోగ‌తి

-ఐదుగురు నిందితుల అరెస్ట్
టి మీడియా, మే21, హైద‌రాబాద్: బేగంబ‌జార్ కులోన్మాద హ‌త్య విష‌యంలో పోలీసుల పురోగ‌తి… ఐదుగురు నిందితుల అరెస్ట్హైద‌రాబాద్ బేగంబ‌జార్‌లోని చేప‌ల మార్కెట్ ద‌గ్గ‌ర జ‌రిగిన కులోన్మాద హ‌త్య‌లో పోలీసులు 24 గంట‌ల్లోనే పురోగ‌తి సాధించారు. హ‌త్య‌కు పాల్ప‌డిన న‌లుగుర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్య సంజ‌న బాబాయి కుమారులు, స్నేహితులు నీర‌జ్ ప‌న్వార్ (21) ను హ‌త్య చేశారు.వీరిని క‌ర్నాట‌క‌లోని గురుమ‌త్క‌ల్‌లో హైద‌రాబాద్ ప‌శ్చిమ మండ‌ల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. నీర‌జ్ ప‌న్వార్‌ను హ‌త్య చేసి ఈ దుండ‌గులు క‌ర్నాట‌క‌కు ప‌రార్ అయ్యారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు వీరు క‌ర్నాట‌క వైపు ప‌రార్ అయ్యార‌ని గుర్తించారు. వీరే కాకుండా మ‌రో 10 మందిని కూడా అదుపులోకి తీసుకొని, టాస్క్ ఫోర్స్ పోలీసులు విచారిస్తున్నారు.

Also Read : టెన్త్ ఎగ్జామ్స్ – విద్యార్థులు ఉచిత ప్రయాణం

హైద‌రాబాద్ బేగంబజార్లోని మ‌చ్చీ మార్కెట్‌లో మ‌రో కులోన్మాద హ‌త్య జ‌రిగింది. రాజేంద‌ర్ ప‌న్వార్‌ను అనే వ్యాపారిని రాడ్ల‌తో కొట్టి, క‌త్తుల‌తో పొడిచి అమానుషంగా చంపారు.నీర‌జ్ ప‌న్వార్ అదే ప్రాంతానికి చెందిన సంజ‌న‌ను ఏడాదిన్న‌ర కింద‌ట ప్రేమించి, పెండ్లి చేసుకున్నాడు. వారికి రెండు నెల‌ల బాబు కూడా వున్నాడు. పెండ్లి అయిన‌ప్ప‌టి నుంచే ఇరు కుటుంబాల మ‌ధ్య గొడ‌వలు జ‌రుగుతున్నాయి.శుక్రవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో నీరజ్‌ పన్వార్‌ బేగంబజార్‌ చేపల మార్కెట్‌ ప్రాంతంలో తన బంధువు దుకాణానికి తాతతో కలిసి వెళ్లివస్తుండగా.. ఐదుగురు దుండగులు అతని బైక్‌ను అడ్డుకొని దాడికి దిగారు. వెంబడించి విచక్షణారహితంగా కత్తులు, రాడ్లతో దాడి చేసి హత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని నీరజ్‌ను ఉస్మానియా దవాఖానకు తరలించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube