మహబూబాబాద్ జిల్లాలో దారుణం..
-భార్యను నరికి చంపిన భర్త
టీ మీడియా, జూలై 26,మహబూబాబాద్ : అనుమానం పెనుభూతమైంది. కట్టుకున్న భర్తే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యను భర్త గొడ్డలితో అత్యతంత కిరాతకంగా నరికి చంపాడు. ఈ విషాదకర సంఘటన మరిపెడ మండలం తానం చర్ల శివారు ఆనకట్ట తండాలో తెల్లవారు జామున చోటు చేసుకుంది.స్థానికులు తెలిపిన వివారాలు ఇలా ఉన్నాయి. తండాకు చెందిన బానోత్ రవి, మమత(28) లకు ఆరేండ్ల క్రితం వివాహం జరిగింది. భర్త రవి భార్యను నిత్యం అనుమానిస్తూ వేధించేవాడని బాధితురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.
Also Read : నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద
ఈ నేపథ్యంలో తెల్లవారు జామున మమతను గొడ్డలితో నరికి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు నిందితుడు రవి ఇంటిని తగుల బెట్టి, వస్తువులన్నీ ధ్వంసం చేశారు.మృతదేహాన్ని తరలిస్తున్న క్రమంలో ఆందోళన చోటు చోటు చేసుకోవడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.