రేషన్ డాన్ చేతిలో బలైన యువకుడు

అక్రమాని కి అడ్డు అని బోలోరో తో గుద్ది హత్య

1
TMedia (Telugu News) :

రేషన్ డాన్ చేతిలో బలైన యువకుడు
– అక్రమాని కి అడ్డు అని బోలోరో తో గుద్ది హత్య

టీ మీడియా,ఆగస్టు 5, ఎన్ టి ఆర్ జిల్లా: తెలంగాణ రాష్ట్రంలోనీ ఎర్రుపాలెం ఫ్లైఓవర్ పై చోటు చేసుకున్నది.మృతుడు ఎన్టీఆర్ జిల్లా వీరలపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తింపు.రాత్రి పది గంటల సమయంలో బోలోరా వ్యాన్ తో శీలం నరేంద్ర రెడ్డిని రైస్ డాన్ హతమార్చరు.రక్తపు మడుగులో నరేంద్ర రెడ్డి పడి ఉన్నారు.అదే గ్రామానికి చెందిన కాజా సత్యనారాయణ అలియాస్ సత్యంగా పిలవబడుతున్న రైస్ డాన్.సత్యమే నరేంద్ర రెడ్డిని హతమార్చి ఉంటారని జయంతి గ్రామస్తులు గుసగుసల వినిపి స్తున్నయి.సత్యం చేస్తున్న అక్రమ రేషన్ బియ్యం విషయంపై అడ్డు తగులుతున్న నరేంద్ర రెడ్డి.నరేంద్ర రెడ్డి ని పథకం ప్రకారమే బోలోర వ్యాన్ తో చంపి చేతులు దులుపుకున్న రైస్ డాన్ కాజా సత్యఫ్లై ఓవర్ వద్ద ప్రమాదం జరిగితే గుర్తుతెలియని ప్రదేశానికి బాడీ ని తరలించిన సత్యం అనుచరులు.

 

Also Read : కాంగ్రెస్ పార్టీకి దాసోజు శ్ర‌వ‌ణ్ రాజీనామా

 

గతంలో కూడా ముగ్గురు వ్యక్తులపై కన్ను ఎర్ర చేసిన సత్యంసత్యం పన్నాగంలో ముగ్గురు యువకులు నదుముల్లు పోగొట్టుకున్నరు అన్న స్థానిక అభిప్రాయం గా ఉంది.జీవనాధారం లేక రోడ్డును పడ్డ పడగల మహేష్, నందిగామ గోపి, పాలపట్ల వినోద్, అదే గ్రామానికి చెందిన యువకులుఎంతోమంది యువకుల జీవితాలతోఆటలాడుకుంటున్న కాజా సత్యం అనే పిలపబడే రైస్ డాన్ (చీకటి వ్యాపారిఇంత జరుగుతు న్న పోలీస్ కనుచూపుమేరలోలేరు .రాత్రి పది గంటల సమయంలో జరిగితే ఎఫ్ఐఆర్ కట్టని పోలీస్ అధికారులు వ్యాహరం పై కూడా అనుమానాలు ఉన్నయి.జయంతి గ్రామంలో ఏమి జరుగుతుంది.కాజా సత్యానికి ఎదురు నిలబడితే రక్తపు పాలేనా?.ఎందుకు పోలీస్ అధికారులు సత్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు.జయంతి గ్రామంలో అక్రమ రేషన్ బియ్యం కదా కథగా మిగిలేనా?.ఎన్టీఆర్ జిల్లా నుంచి కాకుండా తెలంగాణ నుంచి కూడా దిగుమతులు చేస్తున్న అక్రమ రేషన్ బియ్యం దందాతెలంగాణ ఇతర ప్రదేశాల నుండి దిగుమతి చేసి కాకినాడ పోర్టుకు ఎగుమతి చేస్తున్న రేషన్ బియ్యం అక్రమ దారుడు కాజా సత్యనారాయణ.నరేంద్ర మరణంతో ఇక మరణాలు ఆగేనా?కాజా సత్యం చేతిలో ఇంకా ఎంతమంది యువకులు బలిగాబోతున్నారు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.నిరుపేదల తినాల్సిన రేషన్ బియ్యం కోట్ల రూపాయల్లో సొమ్ము చేసుకుంటున్న కాజా సత్యం.అక్రమ రేషన్ దందా కు ముగింపు ఎప్పుడనీ స్థానికులు అంటున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube