అనుమానంతో భార్య‌ను క‌డ‌తేర్చాడు

అనుమానంతో భార్య‌ను క‌డ‌తేర్చాడు

1
TMedia (Telugu News) :

అనుమానంతో భార్య‌ను క‌డ‌తేర్చాడు

టీ మీడియా, ఆగస్టు 26, చెన్నై : అనుమానంతో భార్య‌ను క‌త్తితో పొడిచి దారుణంగా హ‌త్య చేసిన వ్య‌క్తి ఉదంతం త‌మిళ‌నాడులోని క‌రూర్‌లో గురువారం వెలుగుచూసింది. హ‌త్య కేసులో జైలు పాలైన నిందితుడిపై ప‌లు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. భార్య‌ను హ‌త్య చేసిన అనంత‌రం నిందితుడు ప‌రార‌య్యాడు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం భ‌వ‌న నిర్మాణ కార్మికుడైన నిందితుడు సెల్వ‌రాజ్ కొన్నేండ్ల కింద‌ట స‌త్య అనే మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు.

 

Also Read : చైనా విమానాల‌పై అమెరికా స‌స్పెన్ష‌న్‌

వీరికి ఇద్ద‌రు పిల్లలుండ‌గా సెల్వ‌రాజ్ అనుమానంతో నిత్యం భార్య‌ను వేధింపుల‌కు గురిచేసేవాడు. ఇదే విష‌య‌మై ఇద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ ఘ‌ర్ష‌ణ జ‌రుగుతుండేది. ఈ క్ర‌మంలో గురువారం ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెర‌గ‌డంతో కోపోద్రిక్తుడైన సెల్వ‌రాజ్ కిచెన్‌లో వాడే క‌త్తితో భార్యను ప‌లుమార్లు పొడిచాడు. ఆమెను ఆస్ప‌త్రికి తీసుకెళ్లాల‌ని పెద్ద‌కుమారుడికి చెప్పిన సెల్వ‌రాజ్ ఆపై ప‌రారయ్యాడు. స‌త్య‌ను ఆస్ప‌త్రికి తీసుకువెళ్ల‌గా అప్ప‌టికే మ‌ర‌ణించిన‌ట్టు వైద్యులు తెలిపారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు సెల్వ‌రాజ్‌ను ప‌ట్టుకునేందుకు గాలింపు చేప‌ట్టారు.

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube