తమ్ముడినే నరికి చంపిన అన్న

తమ్ముడినే నరికి చంపిన అన్న

1
TMedia (Telugu News) :

 

 

MURDER PLACE
MURDER PLACE POICE VISITING

సొంత తమ్ముడినే నరికి చంపిన అన్న.. తన భార్యతో అలా ప్రవర్తించడం చూసి.. అర్ధరాత్రి..
అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా.. తమ్ముడు.. వదినతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. అన్న.. సొంత తమ్ముడిని హత్యచేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలో…అక్రమ సంబంధాలు కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా.. తమ్ముడు.. వదినతో ఎఫైర్ పెట్టుకున్నాడని.. అన్న.. సొంత తమ్ముడిని హత్యచేశాడు. ఈ దారుణ ఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం గ్రామానికి చెందిన సాధం కృష్ణ తన భార్యతో.. తమ్ముడు సాదం నరేష్ మధ్య అక్రమ సంబంధం నడుస్తోందని అనుమానించాడు. సాదం కృష్ణ.. తన భార్య, తమ్ముడి వ్యవహారంపై కన్నేశాడు. ఈ క్రమంలో తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. నరేష్ పై కోపోద్రికుడైన కృష్ణ ఆదివారం అర్ధరాత్రి సమయంలో గొడ్డలితో నరికి హత్య చేశాడు.

ALSO READఖమ్మం లో విప్ రేగా

అయితే.. అన్నదమ్ములు ఇద్దరు ఒకే ఇంట్లో పక్కపక్కనే ఉంటున్నారని స్థానికులు తెలిపారు. అన్నదమ్ములు ఇద్దరు మద్యం సేవించి భార్యలను ఇబ్బందులు గురిచేస్తుండటంతో.. కొన్ని రోజుల క్రితం వారిద్దరూ పుట్టింటికి వెళ్లారని స్థానికులు వెల్లడించారు. అయితే.. తన భార్య పుట్టింటికి వెళ్లడానికి కారణం కారణం తన తమ్ముడే అని మనస్థాపం చెందిన అన్న కృష్ణ.. సోమవారం తెల్లవారుజామున గొడ్డలితో తల నరికి చంపాడు. ఉదయం గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై వీరప్రసాద్.. పరిశీలించి వివరాలు సేకరించారు. ఈఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని వైరా ఏసిపి రహమాన్, సీఐ సురేష్ పరిశీలించారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube