జేడీయూ నేత దీప‌క్ మెహ‌తాను కాల్చిచంపిన దుండ‌గులు!

జేడీయూ నేత దీప‌క్ మెహ‌తాను కాల్చిచంపిన దుండ‌గులు!

1
TMedia (Telugu News) :

జేడీయూ నేత దీప‌క్ మెహ‌తాను కాల్చిచంపిన దుండ‌గులు!
టీ మీడియా ,మార్చి 30, పాట్నా : బిహార్ రాజ‌ధాని ప‌ట్నాలోని దేనాపూర్ వ‌ద్ద జేడీయూ సీనియ‌ర్ నేత దీప‌క్ కుమార్ మెహ‌తాను దుండ‌గులు కాల్చిచంపారు. బుల్లెట్ గాయాల‌తో మెహ‌తా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించారు. నిందితులు మెహ‌తాపై ఐదు బుల్లెట్ల‌ను గురిపెట్ట‌గా ఒక బుల్లెట్ ఛాతీలోకి మ‌రో బుల్లెట్ త‌ల‌లోకి దూసుకెళ్లింది.మెహ‌తా ప్ర‌స్తుతం ద‌నాపూర్ న‌గ‌ర ప‌రిష‌త్ ఉపాధ్యక్షుడిగా సేవ‌లందిస్తున్నారు. జేడీయూ ఉపాధ్య‌క్షుడు ఉపేంద్ర కుష్వాహ‌కు మెహ‌తా అత్యంత స‌న్నిహితుడు. మెహ‌తాను నేర‌గాళ్లు కాల్చిచంపిన స‌మాచారం అందుకున్న వెంట‌నే ఆయ‌న ఇంటికి కుష్వాహ చేరుకున్నారు.ఇది దుర‌దృష్ట‌క‌ర ఘ‌ట‌న అని, మెహ‌తాపై దాడి చేసిన వారిపై ప్ర‌భుత్వ క‌ఠిన చ‌ర్య‌లు చేప‌డుతుంద‌ని అన్నారు. దీప‌క్ మెహ‌తా 2020 బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌నాపూర్ నుంచి రాష్ట్రీయ లోక్‌స‌మ‌తా పార్టీ (ఆర్ఎల్ఎస్‌పీ) టికెట్‌పై పోటీ చేశారు. ఆర్ఎల్ఎస్‌పీ అనంత‌రం జేడీయూలో విలీనమైంది.

Also Read : సదరం క్యాంప్ ను సద్వినియోగం చేసుకోండి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube