పిల్లల ముందే కత్తితో పొడిచి చంపిన వ్యక్తి

పిల్లల ముందే కత్తితో పొడిచి చంపిన వ్యక్తి

1
TMedia (Telugu News) :

పిల్లల ముందే కత్తితో పొడిచి చంపిన వ్యక్తి
టి మీడియా, ఎప్రిల్22,న్యూఢిల్లీ: మహిళను వెంటాడిన ఒక వ్యక్తి ఆమె పిల్లల ముందే కత్తితో పొడిచి చంపాడు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. నైరుతీ ఢిల్లీలోని సాగర్ పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నది. ఒక పిల్లాడ్ని ఆమె ఎత్తుకోగా, మరో బాలుడు ఆమె వెంట నడుస్తున్నాడు.అయితే ఎర్ర రంగు టీషర్టు ధరించిన ఒక వ్యక్తి ఆ మహిళ వెంటపడ్డాడు. వెంట తెచ్చిన కత్తితో ఆమెను పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

Also Read : ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుంది..మంత్రి పువ్వాడ

దీంతో అక్కడకు చేరిన పోలీసులు కత్తి పోటు గాయాలతో కిందపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ మహిళ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన మహిళ హత్య వీడియోను పోలీసులు పరిశీలించారు. హత్య చేసిన వ్యక్తి ఆమెకు తెలుసని చెప్పారు. ప్రస్తుతం ఉంటున్న ఇంట్లోకి మారక ముందు ఆమె ఉన్న ఇంటికి పొరుగున అతడు ఉండేవాడని తెలిపారు. అయితే ఆ మహిళను అతడు హత్య చేసేందుకు దారి తీసిన కారణం ఏమిటన్నది తెలియలేదన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ హత్యా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube