కొడుకును హతమార్చిన తండ్రి

కొడుకును హతమార్చిన తండ్రి

1
TMedia (Telugu News) :

కొడుకును హతమార్చిన తండ్రి

టి మీడియా,ఎప్రిల్ 25,మంచిర్యాల: రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిమడుగు గ్రామపంచాయతీలో ఓ కసాయి తండ్రి తన 11 నెలల కన్న కొడుకును సోమవారం అతి కిరాతకంగా హత్య చేశాడు. తన భార్యతో జరిగిన గొడవ కారణంగా మద్యం మత్తులో బొళ్ళన శ్రీ కృష్ణ ను అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన పులిమాడుగు ప్రాంతంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడిని బోల్లాన నరేష్ గా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కొడుకు శ్రీకృష్ణ ఏడుస్తూ ఉండడం, భార్యతో గొడవ జరిగిన నేపథ్యంలో అసహనానికి గురై మద్యం మత్తులో శ్రీ కృష్ణ ను ఇటుకల బట్టి కి తలనే సి కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.

Also Read : యాదాద్రి స‌న్నిధిలో సీఎం కేసీఆర్ దంప‌తులు

తల్లిదండ్రులు నరేష్ ,జ్యోతి ఇద్దరు సమీప ఇటుక బట్టీలో పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి ఎస్సై జి సుధాకర్ చేరుకొని చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పట్టణ ఎస్ఐ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube