చంపింది భార్య సోదరులే సరూర్‌నగర్ హత్య కేసులోపురోగతి
చంపింది భార్య సోదరులే సరూర్‌నగర్ హత్య కేసులోపురోగతి
చంపింది భార్య సోదరులే సరూర్‌నగర్ హత్య కేసులోపురోగతి
టీ మీడియా,మే 5,హైదరాబాద్: సరూర్‌నగర్ వ్యక్తి హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సరూర్‌నగర్‌లో బైక్‌పై వెళ్తున్న యువతి, యువకుడిని కొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. యువతిని పక్కకు నెట్టివేసి యువకుడిపై కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు నాగరాజు అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తులో పరువు హత్యగా గుర్తించారు. ఇద్దరు నిందితులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌ను అరెస్ట్ చేశారు.సరూర్‌నగర్‌కు చెందిన నాగరాజు, సుల్తానా బాల్య స్నేహితులు. కాలం గడిచే కొద్ది వారి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమ మారింది. దీంతో వాళ్లిద్దరూ జనవరి నెలలో పెళ్లి చేసుకున్నారు. తమ చెల్లెలు సుల్తానా మతాంతర వివాహం చేసుకోవడం సోదరులు మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్‌కు ఇష్టం లేదు. చెల్లెని పెళ్లి చేసుకున్ననాగరాజుపై కక్ష పెంచుకున్నారు.
Also Read : ప్రమాదం ఇద్దరు మృతి
అదును కోసం ఎదురు చూశారు. సుల్తానా, నాగరాజు సరూర్‌నగర్‌లో బైక్ వెళ్తుండగా అడ్డుకున్నారు. అందరూ చూస్తుండగానే నాగరాజును మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ విచక్షణారహితంగా కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానిక సీసీ ఫుటేజులను పరిశీలించారు. దీంతో నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తమ చెల్లెలిని పెళ్లి చేసుకున్నాడన్న కోపంతోనే నాగారాజును మూబిన్ అహ్మద్, మసూద్ అహ్మద్ హత్య చేశారని పోలీసులు తెలిపారు. నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలిస్తామని చెప్పారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube