భ‌ర్త‌పై భార్య బ్లేడ్‌తో దాడి

భ‌ర్త‌పై భార్య బ్లేడ్‌తో దాడి

1
TMedia (Telugu News) :

భ‌ర్త‌పై భార్య బ్లేడ్‌తో దాడి
టి మీడియా,ఎప్రిల్ 25,హ‌నుమ‌కొండ : వారిద్ద‌రూ న‌వ దంప‌తులు.. నెల రోజుల‌కే క్రిత‌మే వివాహం జ‌రిగింది. అన్యోన్యంగా సాగాల్సిన వారి సంసారంలో.. మ‌న‌స్ప‌ర్థ‌లు సంభ‌వించాయి. కట్టుకున్న భ‌ర్త‌నే క‌డ‌తేర్చాల‌ని భార్య నిర్ణ‌యించుకుంది. గాఢ నిద్ర‌లో ఉన్న భ‌ర్త మెడ‌ను బ్లేడ్‌తో కోసింది భార్య‌.వివ‌రాల్లోకి వెళ్తే.. దామెర మండ‌లం ప‌స‌ర‌గొండ‌కు చెందిన రాజు అనే యువ‌కుడు.. నెల రోజుల క్రితం లావ‌ణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రాజు వృత్తిరీత్యా మ‌ల్క‌పేట‌లోని ఓ క్ర‌ష‌ర్‌లో సూప‌ర్ వైజ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు.

Also Read : రూపాయికే లీటర్‌ పెట్రోల్‌

అయితే పెళ్లైన కొత్త‌లో ఇద్ద‌రూ మంచిగానే ఉన్న‌ప్ప‌టికీ.. ఇటీవ‌లే మ‌న‌స్ప‌ర్థ‌లు ఏర్ప‌డ్డాయి.ఈ క్ర‌మంలో సోమ‌వారం తెల్ల‌వారుజామున గాఢ నిద్ర‌లో ఉన్న రాము మెడ‌పై లావ‌ణ్య బ్లేడ్‌తో దాడి చేసింది. రాజుకు తీవ్ర ర‌క్త‌స్రావం కావ‌డంతో కుటుంబ స‌భ్యులు అత‌న్ని ఎంజీఎం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. రాజు ఆరోగ్యం ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube