దళిత మహిళపై దాడి అమానుషం

దళిత మహిళపై దాడి అమానుషం

1
TMedia (Telugu News) :

దళిత మహిళపై దాడి అమానుషం.
టీ మీడియా,మార్చి 12,ఖమ్మం : దళిత మహిళ జి. భూలక్ష్మి పై అధికార పార్టీ కు చెందిన 58 వ డివిజన్ కార్పొరేటర్ అనుచరులు దాడి చేయడాన్ని తెలంగాణ బహుజన జేఏసీ రాష్ట్ర చైర్మన్ బానోతు బద్రు నాయక్, జిల్లా చైర్మన్ పోతగాని వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. అధికార పార్టీ టిఆర్ఎస్ 58 వ డివిజన్ కార్పొరేటర్ అనుచరులు దళిత మహిళ జి. భూలక్ష్మి పై తీవ్రంగా దాడి చేయడంతో ఆమెను నగరంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని శనివారం తెలంగాణ బహుజన జేఏసీ నాయకులు ఆమెను పరామర్శించారు. అధికార పార్టీ అనే అహంకారంతో దళితులపై దాడి చేయడం ఖమ్మం జిల్లాలో ఒక అలవాటుగా మారిందని విమర్శించారు.

Also Read : పేద కుటుంబాలకు అండగా యూత్ ఐకాన్

అధికార పార్టీకి చెందిన మంత్రి , కార్పొరేటర్ల అండదండలు తమకు ఉన్నాయనే ఈ విధమైన విధానాన్ని కొంతమంది ఎంచుకున్నారని ఆరోపించారు. బాధిత మహిళా భూలక్ష్మి కి న్యాయం జరిగే వరకు తమ సంఘం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. దాడికి పాల్పడ్డ నిందితులపై వెంటనే కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఇటువంటి వాతావరణం గతంలో లేదని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంగం జిల్లా కన్వీనర్ షేక్ నజీమా, సలహాదారులు నకిరేకంటి సంజీవరావు, బి ఎస్ పి జిల్లా మాజీ అధ్యక్షుడు మట్టే గురుమూర్తి , తెలంగాణ బహుజన జేఏసీ నాయకులు తీగల రాము, రవీందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube