ఎమ్మెల్యే పై హత్యా‌నేరం కేసు నమోదు చేయాలి

పవన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు

0
TMedia (Telugu News) :

ఎమ్మెల్యే పై హత్యా‌నేరం కేసు నమోదు చేయాలి..

-పవన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు

-టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి

టీ మీడియా, ఫిబ్రవరి 21,వరంగల్ : జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు అరాచక శక్తులుగా మారారని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో గుండాల పాలన సాగుతోందని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి హనుమకొండలో హైటెన్షన్ నెలకొంది. రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ ముగిసిన తరువాత యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ పై హత్యాయత్నం జరిగింది. కొందరు వ్యక్తులు పవన్ ను విచక్షణా రహితంగా కొట్టి, తీవ్రంగా గాయపర్చారు. రక్తపు మడుగులో పడిఉన్న పవన్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, పవన్ పై దాడి చేసింది ఎమ్మెల్యే అనుచరులేనని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ అంశంపై రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, ఆయన అనుచరులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.భూకబ్జాల నాయకుడు, ఆరాచకాలకు మూలకర్త వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ బాస్కర్ అని, ఆయన అనుచరులు గంజాయి బానిసలు అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. గంజాయి మత్తులో అనేక నేరాలకు, దాడులకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ తూర్పు- పశ్చిమ ఎమ్మెల్యేలు వారి అనుచరులను గంజాయి మత్తుకు బానిసలను చేశారని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకే పవన్‌పై విచక్షణా రహితంగా దాడి చేశారంటూ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి

ఎమ్మెల్యే వినయ్ బాస్కర్‌పై హత్యా నేరం కేసు నమోదు చేయాలని రేవంత్ రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అనుచర ముఠా యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్ ను హత్య చేయడానికి ప్లాన్ చేశారని, అదృష్టవశాత్తు బతికి బయటపడ్డాడని రేవంత్ అన్నారు. ఇది పోలీసుల వైఫల్యం అని, ఇలాంటి అరాచక శక్తులపై ఉక్కు పాదం మోపాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల నిస్సహాయత మంచిది కాదని, ఈ విషయంపై తక్షణమే తెలంగాణ డీజీపీ స్పందించాలన్న రేవంత్ రెడ్డి.. డీజీపీ క్షేత్రస్థాయిలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటూ కోరారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube