హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్

0
TMedia (Telugu News) :

హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
టిమీడియా, ఏప్రిల్8, జూలూరుపాడు:
జూలూరుపాడు మండలం కొమ్ముగూడెంలో గత నెల జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామంలో గత నెల 23 వ తారీకు రాత్రి 11 గంటల 30 నిమిషాలకు కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఆంగోతు పెరుమాళ్ళు అతని భార్య పూతిలీ బాయ్, కుమార్తె సుమిత్ర లపై పూతిలీ బాయ్ అన్న అయిన భోజ్యాలాల్, అతని భార్య విజయ మరియు వారి కుమారుడు మైనర్ బాలుడు, బొజ్జ లాల్ తమ్ముడు సేవ మరియు లింగాలు అను ఐదుగురు పథకం ప్రకారం కత్తులతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయాలపాలైన రుమాలు అతని భార్య పుతిలి భాయి, కుమార్తె మిత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పెరుమాళ్ళు మార్చి 24 న కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పటల్ నందు మరణించడం జరిగింది.

Also Read;తెలంగాణ ధాన్యాన్ని కొనాలి\

ఈ విషయమై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన సిఐ వసంత్ కుమార్, ఎస్సై శ్రీకాంత్ నిందితుల కోసం వెళ్లగా వారు పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి వర్ధమాన్ అనే ప్రాంతానికి పారిపోయి , వారి దగ్గర ఉన్న నగదు అయిపోవడంతో ఇంట్లో నే ఉన్న ఏటీఎం కార్డులు మరియు నగదు కోసం తీసుకు వెళ్ళడానికి ఈ రోజు తెల్లవారుజామున ఖమ్మం చేరుకొని ఉదయం 5 గంటల సమయంలో కొమ్ముగూడెం గ్రామానికి రాగానే వారిని పట్టుకోవడం జరిగింది వీరి మధ్య ఆస్తి వివాదాలే కారణమని డి.ఎస్.పి వెంకటేశ్వర బాబు వెల్లడించారు నలుగురు నిందితులు ఒక మైనర్ బాలుడు ఈ హత్యకు పాల్పడినట్లు విచారణలో తేలిందని, వారి వద్ద నుండి హత్యకు ఉపయోగించిన రెండు కత్తులను ఒక కర్రను సీజ్ చేయడం జరిగినది బొజ్జ లాల్ గవర్నమెంట్ టీచర్ బానోత్ సేవ భోజ లాల్ భార్య కొమ్ముగూడెం గ్రామ అంగన్వాడీ టీచర్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు.

Also Read;స్కూళ్లు, ఆరోగ్య కేంద్రాలను పరిశీలించిన తమిళనాడు సీఎం స్టాలిన్‌

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube