ముర్ముకు జెడ్‌ప్లస్ భద్రత
టి మీడియా,జూన్ 22,న్యూఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్ తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముర్ముకు కేంద్రం జెడ్ ప్లస్ క్యాటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదికి నేటి నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భదత్ర ఇవ్వనున్నాయి. ముర్ము ఇవాళ ఒడిశాలోని రాయ్రంగ్పూర్లో ఉన్న శివాలయానికి వెళ్లారు. అక్కడ ఆమె చీపురు పట్టి ఆలయాన్ని శుభ్రం చేశారు. ఆ తర్వాత దర్శనం చేసుకున్నారు.
Also Read : పోప్ ఫ్రాన్సిస్‌ను కలిసిన ఒడిశా సీఎం
ద్రౌపది ముర్ముఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న మారుమూల గ్రామమైన బైడపోసిలో సంతాల్ గిరిజన తెగలో 1958 జూన్ 20న ద్రౌపది ముర్ము జన్మించారు. 2015 మార్చి 6 నుంచి 2021 జూలై 12 వరకు జార్ఖండ్ గవర్నర్‌గా ఆమె పనిచేశారు. జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్‌గా ఆమె నియమితులయ్యారు. పైగా దేశ చరిత్రలో ఓ గిరిజన తెగకు చెందిన వ్యక్తి ఓ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులైన నేత ఆమె కావడం విశేషం. ఒడిశాలోని రాయరంగాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ, జేడీయూ సంకీర్ణ ప్రభుత్వంలో వాణిజ్య, రవాణా శాఖ, మత్స్యసంపద, పశు సంవర్ధక శాఖ మంత్రిగా సేవలందించారు. ముర్ము రాజకీయాల్లోకి రాకముందు టీచర్‌గా కొంతకాలం పనిచేశారు.