రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం

పేద‌లు త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు

1
TMedia (Telugu News) :

రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణం
-పేద‌లు త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు
టి మీడియా,జూలై25,న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంటు స్రెంటల్‌ హాల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.. ద్రౌపది ముర్ముతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, కేంద్ర మంత్రులు, గవర్నర్లు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, ద్రౌపతి ముర్ము కుటుంబ సభ్యులు హాజరయ్యారు.అంతకుముందు ద్రౌపది ముర్ము.. ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నారు. సంప్రదాయబద్ధంగా నిర్వహించే ఊరేగింపుతో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో కలిసి పార్లమెంటు సెంట్రల్‌ హాలుకు చేరుకున్నారు. జస్టిస్‌ ఎన్వీ రమణ.. రాజ్యాంగంలోని ఆర్టికల్‌-60 ప్రకారం ఆమెతో ప్రమాణం చేయించారు. ఆ వెంటనే సైన్యం 21 సార్లు గాల్లోకి కాల్పులు జరిపి నూతన రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించింది. పేద‌లు త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు: రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముపేద‌లు త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు.

 

Also Read : ‘మంకీపాక్స్‌’ కలకలంపై వైద్యాధికారుల స్పందన

15వ రాష్ట్ర‌ప‌తిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన ద్రౌప‌ది ముర్ము జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. అత్యున్నత ప‌ద‌వికి ఎన్నిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఉత్స‌వాల వేళ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌కావ‌డం సంతోషంగా ఉందన్నారు. పార్ల‌మెంట్ సెంట్ర‌ల్ హాల్‌లో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం జ‌రిగింది. దేశ ప్ర‌జ‌ల విశ్వాసం నిల‌బెట్టుకునేలా పనిచేస్తాన‌న్నారు. దేశంలో మ‌రింత వేగంగా అభివృద్ధి ప‌నులు చేప‌ట్టాల్సి ఉందన్నారు. పేద‌లు కూడా త‌మ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు అని త‌న‌తో రుజువైంద‌న్నారు. మీ న‌మ్మ‌కం, మ‌ద్ద‌తు బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించేందుకు త‌న‌కు శ‌క్తినిస్తుంద‌న్నారు. భార‌త్‌ స్వాతంత్య్రం సాధించిన త‌ర్వాత పుట్టిన తొలి రాష్ట్ర‌ప‌తిని తానే అన్నారు. స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధులు ఆశ‌యాల‌కు త‌గిన‌ట్లు అభివృద్ధిలో వేగం పెంచాల‌న్నారు.రాష్ట్ర‌ప‌తి పోస్టును చేరుకోవ‌డం త‌న వ్య‌క్తిగ‌త ఘ‌న‌త‌గా భావించ‌డం లేద‌ని, ఇది భార‌త్‌లో ఉన్న ప్ర‌తి పేద‌వాడి అచీవ్‌మెంట్ అని, తాను రాష్ట్ర‌ప‌తిగా నామినేట్ అవ్వ‌డం అంటే, దేశంలో పేద‌లు క‌ల‌లు క‌న‌వ‌చ్చు అని, వాళ్లు ఆ క‌ల‌ల్ని నిజం చేసుకోవ‌చ్చు అని రుజువైంద‌న్నారు. ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరంగా ఉన్న పేద‌లు, ద‌ళితులు, వెనుక‌బ‌డిన‌వాళ్లు, గిరిజ‌నులు, త‌న‌ను ఆశాకిర‌ణంగా చూడ‌వ‌చ్చు అన్నారు. త‌న నామినేష‌న్ వెనుక పేద‌ల ఆశీస్సులు ఉన్నాయ‌ని రాష్ట్ర‌ప‌తి ముర్ము అన్నారు. కోట్లాది మ‌హిళ‌ల ఆశ‌లు, ఆశ‌యాల‌కు ప్ర‌తిబింబంగా నిలుస్తుంద‌న్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube