అయ్యప్ప స్వాములకు అన్న వితరణ చేసిన ముస్లిం సోదరులు
అయ్యప్ప స్వాములకు అన్న వితరణ చేసిన ముస్లిం సోదరులు
అయ్యప్ప స్వాములకు అన్న వితరణ చేసిన ముస్లిం సోదరులు
లహరి ,నవంబర్ 29, వనపర్తి బ్యూరో : పెబ్బేరు పురపాలక పరిధిలోని షిరిడి సాయిబాబా ఆలయంలో యువ నాయకుడు ఎండి ఆఫ్రోజ్ ఆధ్వర్యంలో మంగళవారం అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆఫ్రోజ్ మాట్లాడుతూ మతం ఏదైనా సరే ఆదరించే స్వభావం ఉన్న వాడే గొప్ప మనిషి అని అన్నారు. రోజురోజుకు భక్తి ప్రభావం పెరిగిందని 40 రోజులపాటు అయ్యప్ప స్వామి దీక్ష చేయడం ఆరోగ్యదాయకం అన్నారు. కార్తీక మాసం హిందువు సోదరులకు అతి పవిత్రమైనదని మీ సంకల్పం నెరవేరి కుటుంబాలతో సంతోషంగా ఉండాలని కొరారు.
Also Read : విద్యుత్ షాక్ తో విద్యార్థిని మృతి
ఒక మంచి భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముస్లిం సోదరులకు అయ్యప్పస్వాములు అభినందించారు.ఈ కార్యక్రమంలో ఎంఐఎం మండల అధ్యక్షుడు ఎం.డి ఆఫ్రోజ్, ఉప అధ్యక్షుడు జకీర్, జనరల్ సెక్రెటరీ అరిఫ్, జాయింట్ సెక్రటరీ మస్తాన్, ఆమెర్,సలాం, సమీర్,ఇర్ఫాన్,హాజీ, ఖాదర్,అప్జల్, ఆర్షద్, ముజాఫ్ఫార్, తదితరులు పాల్గొన్నారు.