రాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు

మల్లాది సేవాసమితి ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు చీరల పంపిణీ

1
TMedia (Telugu News) :

రాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు
మల్లాది సేవాసమితి ఆధ్వర్యంలో ముస్లిం మహిళలకు చీరల పంపిణీ
టీ మీడియా, ఏప్రిల్29, మధిర:పేదల కుటుంబాల్లో వెలుగులు నింపటమే లక్ష్యంగా మల్లాది సేవాసమితి, మల్లాది సేవా ట్రస్టు పనిచేస్తుందని, రాజకీయాలకతీతంగా సేవా కార్యక్రమాలు అందించడమే తమ ప్రధాన ఆశయమని లైన్స్ క్లబ్ చైర్మన్ మధిర మున్సిపల్ కౌన్సిలర్లు మల్లాది వాసు సవిత దంపతులు పేర్కొన్నారు. రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మహిళలకు గురువారం చీరల పంపిణీ చేశారు. అనంతరం ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ అలీ అధ్యక్షతన జరిగిన సభలో మల్లాది వాసు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా ముస్లిం మహిళలకు రంజాన్ పర్వదినానికి నూతన వస్త్రాలను మల్లాది సేవా సంస్థ ద్వారా అందించడం జరుగుతుందన్నారు. కులమతాలకు రాజకీయాలకతీతంగా అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

Also Read:తెలంగాణలో టిడిపి బలమైన శక్తిగా నిలవాల : కె.యస్.జవహర్

అల్లా ప్రవక్త చెప్పిన వాక్యాలను స్ఫూర్తిగా తీసుకొని పేదల అభ్యున్నతి కోసం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. రంగస్థల కళాకారుల సమాఖ్య అధ్యక్షులు పుతుంబాక శ్రీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ మల్లాది వాసు సవిత దంపతులు అనేక సంవత్సరాలుగా మధిరలో కులమతాలకు అతీతంగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన గుర్తు చేశారు. మల్లాది వాసు కుటుంబాన్ని అల్లా దీవించాలని ఈ సందర్భంగా కోరుకున్నారు. అనంతరం మల్లాది వాసు సవిత దంపతులు ముస్లిం మత పెద్దలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ఎన్నారై యశ్వంత్ చౌదరి మల్లాది, ముస్లిం మత పెద్దలు పెద్దలు పాల్గొన్నారు.

 

Also Read:వనపర్తి బస్ డిపో ను పరిశీలించిన రీజినల్ మేనేజర్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube