ఎ ప్లస్ గ్రేడ్ కోసం సమష్టి గా పని చేయాలి

టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

1
TMedia (Telugu News) :

ఎ ప్లస్ గ్రేడ్ కోసం సమష్టి గా పని చేయాలి

-టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

టీ మీడియా, నవంబర్ 18,తిరుపతి : ఎస్ జి ఎస్ కాలేజీకి న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ గుర్తింపు రావడానికి సమిష్టిగా పనిచేయాలని జేఈవో శ్రీమతి సదా భార్గవి అధికారులు ఆదేశించారు. కళాశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను గురువారం ఆమె పరిశీలించారు. కళాశాలలోని తరగతి గదులు, అన్ని విభాగాల ల్యాబులు పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా జేఈవో శ్రీమతి సదా భార్గవి మాట్లాడుతూ, ఎస్పీ డబ్ల్యు, ఎస్వీ ఆర్ట్స్ కళాశాలకు ఇటీవలే న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ లభించిందని చెప్పారు. ఎస్జీఎస్ కళాశాల తొలిసారి న్యాక్ గుర్తింపు కోసం వెళ్తున్న నేపథ్యంలో కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర బృందంతోపాటు టీటీడీ లోని అన్ని విభాగాల అధికారులు సిబ్బంది.

Also Read : నకిలీ తుపాకుల లైసెన్స్ ముఠా అరెస్టు

సమన్వయంతో పనిచేసి కళాశాలకు న్యాక్ ఎ ప్లస్ గ్రేడ్ గుర్తింపు లభించేలా ఏర్పాటు చేయాలన్నారు.అంతకుముందు కళాశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 16 మంది విద్యార్థిని విద్యార్థులకు శ్రీ గోవిందరాజస్వామి వాకర్స్ అసోసియేషన్ ప్రకటించిన నగదు బహుమతులను శ్రీమతి సదా భార్గవి అందజేశారు.

బహుమతులు గెలుచుకున్న విద్యార్థులను ఆమె ఈ సందర్భంగా అభినందించారుడిఇవో డాక్టర్ భాస్కర్ రెడ్డి , ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్ , డిఎఫ్వో శ్రీ శ్రీనివాస్, ఈ ఈ శ్రీ మనోహరం , ఐటి జనరల్ మేనేజర్ శ్రీ సందీప్, కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి, శ్రీ గోవిందరాజ స్వామి వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube