టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 12
నియోజకవర్గ కేంద్రమయినా అశ్వరావుపేట మండలం లోని దురదపాడు గ్రామము నందు
గిరిజన కుటుంబాలకు నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం దుప్పట్లు పంపిణీ చేయటం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బిర్రం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ చలికాలంలో ఆర్థికంగా వెనుకబడిన గిరిజన కుటుంబాలకు చలినుండి కాపాడే ఉద్దేశంతోనే నామా ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేస్తున్నామని పేద ప్రజలను ఆదుకునే ఉద్దేశంతో నామా మెమోరియల్ ట్రస్టు తరపున అనేక సేవ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది అని,పేద ప్రజల సంక్షేమ కార్యక్రమాల నిమిత్తం నామా ముత్తయ్య ట్రస్ట్ తరఫున ఇంకా రానున్న రోజులలో అనే సేవ కార్యక్రమాలు చేస్తామని ఆయన తెలిపినారు.
పేద ప్రజలు ఏ అవసరం ఉన్న నామా ముత్తయ్య ట్రస్ట్ ను సంప్రదించ వచ్చునని సహాయ సహకారాలు అందించడానికి నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు ఎప్పుడూ అందుబాటులో ఉంటుదన్న విషయాన్ని గుర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు
కాకా సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్, ఎంపిటిసి పండ రాజు, కాకా చంద్రం, టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు సున్నం వెంకటేశ్వరరావు, కోటేష్, పెద్దకాపు కోర్రం కన్నయ్య,
గ్రామస్తులు, నామ ముత్తయ్య మెమోరియల్ ట్రస్టు సభ్యులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.