ముత్యాల తలంబ్రాల వితరణ

ముత్యాల తలంబ్రాల వితరణ

1
TMedia (Telugu News) :

ముత్యాల తలంబ్రాల వితరణ

టీ మీడియా, ఏప్రిల్ 10, వనపర్తి, బ్యూరో : ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఆర్సి జువెలరీ అధినేత రమేష్ చంద్ర సంయుక్తంగా గత 15 సంవత్సరాలుగా ముత్యాల తలంబ్రాలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా 12 దేవాలయాల్లో ముత్యాల తలంబ్రాలు అందజేశారు. మొదటగా మంత్రి నిరంజన్ రెడ్డి వాసంతి దంపతుల చేతుల మీదుగా రాజనగరం, జగత్ పల్లి, నాగవరం ,రాంనగర్ కాలనీ, రామాలయం, వెంకటేశ్వర దేవాలయం ,కన్యకాపరమేశ్వరి, బాల్ నగర్లోని అభయ ఆంజనేయ స్వామి, ఇందిరా కాలనీ, పీర్ల గుట్ట, మర్రికుంట, సాయి నగర్ దేవాలయాల్లో ముత్యాల తలంబ్రాలు అందజేసే కళ్యాణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోచ రవీందర్రెడ్డి, జగదీష్, అలేఖ్య, తిరుమల్, అలివేలు, గోపాల్, విజయ్, అలివేలమ్మ ,వినోద్ గౌడ్, ఆవుల రమేష్, విశ్వనాథం, ఈశ్వరయ, సునీల్ వాల్మీకి, రఘునాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఢిల్లీలో మంత్రి జిల్లా నేతలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube