-బెల్లం వేణు నీ చరిత్ర ఏమిటి..? : సిపిఐ నేత మౌలానా

-బెల్లం వేణు నీ చరిత్ర ఏమిటి..? : సిపిఐ నేత మౌలానా

1
TMedia (Telugu News) :

మండలంలో చిచ్చుపెడితే సహించం

-ఆగడాలు.. సెటిల్మెంట్లు.. బెదిరించడమేనా..

-బెల్లం వేణు నీ చరిత్ర ఏమిటి..? : సిపిఐ నేత మౌలానా

రూరల్ మండలంలో చిచ్చుపెడితే సహిస్తూ ప్రేక్షక పాత్ర పోషించ లేమని తగు సమాధానం చెప్పక తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహ్మద్ మౌలానా హెచ్చరించారు. అపరిపక్వతతో రాజకీయ ఆరాచకాన్ని సృష్టిస్తూ అవాక్కులు చేవాక్కులు పేలిన వారు మండలంలో కమ్యూనిస్టు పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకుంటే మంచిదని లేకపోతే తగు మూల్యం చెల్లించక తప్పదని ఆయన హెచ్చరించారు. ఏడు దశాబ్దాల కాలంలో కమ్యూనిస్టు పార్టీని దెబ్బతీయాలని అనేక రాజకీయ శక్తులు ప్రయత్నించాయి.

also read :బతుకమ్మ సంబరాలలో ఆడి పాడిన జడ్పిటిసి, సర్పంచ్ “

ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్లు అధికార పార్టీ పంచన చేరి పబ్బం గడుపుకునే నాయకులు కమ్యూనిస్టు పార్టీని ఖమ్మం రూరల్ మండలంలో ఏమీ చేయలేరని మౌలానా తేల్చి చెప్పారు. శనివారం ఎదులాపురంలోని జీవిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మౌలానా మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీకి చెందిన గిరిప్రసాద్, రజన్ అలీ, పువ్వాడ నాగేశ్వరరావు లాంటి అనేక మంది పాత ఖమ్మం తాలూకా పరిధిలోని ఖమ్మం నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహించారని మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఆరుసార్లు ఎన్నికలు జరిగితే నాలుగు సార్లు సిపిఐ అభ్యర్థులే విజయం సాధించారని ఒకసారి అతి స్వల్ప తేడాతో ఓటమి చెందామని మౌలానా తెలిపారు. ఖమ్మం నియోజక వర్గంలో ఎస్సీ, బిసి, మైనార్టీలు సహా అందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేసిన చరిత్ర సిపిఐకి ఉందని ఆయన తెలిపారు. బెల్లం వేణు స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని సెటిల్మెంట్లు, బెదిరించడం రాజకీయాలు కాదని ఆయన తెలుసుకుంటే మంచిదన్నారు.

als read :ముఖ్యమంత్రి ‘బతుకమ్మ’ ఉత్సవాలశుభాకాంక్షలు

అవసరాల కోసం ఎవరి పంచనో చేరి పెత్తనం చేయాలని భావిస్తే మండల ప్రజలు సహించరన్నారు. మండలాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సిపిఐకి ఉందన్నారు. గాలి మాటలతో ఎక్కువ కాలం ప్రజలను నమ్మించ లేరని మౌలానా తెలిపారు. వార్త కార్యాలయం పక్కన నువ్వు ఆక్రమించిన భూమి సంగతి ఏమిటని ఆయన ప్రశ్నించారు. పోలేపల్లి ముగ్గుబొందల గుట్ట ఆక్రమణలో నీ పాత్ర ఏమిటో మండల ప్రజలకు తెలుసునన్నారు. అనైతిక రాజకీయాలకు పాల్పడుతూ లబ్ది పొందాలని చూస్తేకమ్యూనిస్టు పార్టీ చూస్తూ ఊరుకోబోదన్నారు. ప్రశాంతతను కోరుకునే కమ్యూనిస్టు పార్టీ దోపిడీకి, కబ్జాలకు వ్యతిరేకమని కమ్యూనిస్టు పార్టీని విమర్శించే ముందు లేదా కమ్యూనిస్టు పార్టీ నాయకులపై వ్యక్తిగత విమర్శలు చేసే ముందు నీ నేపథ్యం ఏమిటో తెలుసుకోవాలన్నారు. కమ్యూనిస్టు పార్టీ వామపక్ష, ప్రజాతంత్ర లౌకిక శక్తులను కలుపుకుని పయనించేందుకు ప్రయత్నిస్తుందని సొంత లాభాపేక్షతో లౌకిక శక్తుల ఐక్యతను స్థానికంగా దెబ్బకొట్టాలని ప్రయత్నించే వారిని ప్రజలు గమనించాలని మౌలానా కోరారు.

also read :ఉప్పల్‌ స్టేడియంలో పటిష్ట బందోబస్తు

రూరల్ సిఐ సారూ మీ పద్ధతి మార్చుకోండి

రూరల్ సిఐ శ్రీనివాసరావు తన పద్దతి మార్చుకోవాలని బెల్లం వేణు ప్రోద్బలంతో అక్రమ కేసులు పెడుతూ సిపిఐ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతున్నారని సురేష్ ఆరోపించారు. దొంగ రాళ్ల వ్యాపారులతో భూజాల మీద చేతులు వేసి ఫోటోలకు ఫోజులిచ్చే సిఐకి ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులతో మాట్లాడేందుకు మాత్రం సిగ్గు అనిపిస్తుందా ఆయన ప్రశ్నించారు. లెప్రసీ కాలనీలో సిఐ ప్రోద్భలంతోనే కమ్యూనిస్టు హాల్ ఆక్రమణ జరిగిందని ఆక్రమణను అడ్డుకోవడానికి వెళితే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేశారని దీనిపై ఎంఎల్ఎ కందాళ ఉపేందర్రెడ్డికి ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఏపూరి గోపి అనే యువకున్ని కొందరు తీవ్రంగా కొడితే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోలేదని ఈ విషయమై ప్రశ్నించడానికి సిఐ వద్దకు వెళితే బెదిరింపులకు పాల్పడ్డారని సురేష్ తెలిపారు. ఇటీవల జరిగిన ఒక హత్య విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ తమను భయపెట్టేందుకు సిఐ ప్రయత్నిస్తున్నారని ఆయన పోలీస్ అధికారిలా కాక వేణు అనుచరునిలా వ్యవహరిస్తున్నారని ఆయన తెలిపారు. ఒక పోలీస్ అధికారి ఒక హత్యను గురించి గొప్పలు చెప్పడం ఏ పోలీస్ నిబంధనలో ఉందో ఆలోచించుకోవాలని ఉన్నతాధికారులు సైతం దీనిపై స్పందించాలన్నారు. ఖమ్మం రూరల్ మండలంలో భూ పంచాయతీల్లో తలదూర్చి బెల్లం వేణు బాధితులను బెల్లం వేణు వద్దకు వెళ్లి పరిష్కారం చేసుకోండి అంటూ సిఐ సలహా ఇస్తున్నారని బెల్లం వేణు చెప్పిన వారికి మద్ధతుగా నిలబడుతున్నారని స్థానిక తహసీల్దార్ సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారని ఇందుకు సంబంధించి బాధితులు కూడా మీడియా సమావేశంలో ఉన్నారని సురేష్ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube