అడ్డాకుల ప్రచారంలో పాల్గొన్న ఎన్.విజయలక్ష్మి
టీ మీడియా, నవంబర్ 16, అడ్డాకుల : అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అడ్డాకుల మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ, కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని పెద్దమునుగల్ చెడు సర్పంచ్ నల్లమద్ది విజయలక్ష్మి పిలుపునిచ్చారు. దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల మండల కేంద్రంలోని పలు వార్డులలో జోరుగా ప్రచారం నిర్వహించిన నల్లమద్ది విజయలక్ష్మి. అడ్డాకుల మండల కేంద్రం ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామంలోని వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలతో మమేకమై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.విజయలష్మి మాట్లాడుతు.. కేసిఆర్ సారథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ ప్రగతి కార్యక్రమాలను వివరిస్తూ తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి.
Also Read : తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ దోచుకోడానికేనా.?
బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారంలోకి రాగానే నూతనంగా ప్రవేశపెట్టిన మేనిఫెస్టో మహిళల బలోపేతానికి కృషి చేస్తూ సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా గౌరవభృతి 3,000, ఆసరా పెన్షన్ల పెంపు, వంట గ్యాస్ సబ్సిడీ రూ,400, రైతుబంధు పెంపు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి అన్నపూర్ణ పథకం సన్న బియ్యం పంపిణీ తో పాటు రూ,5 లక్షల బీమా వర్తింప చేస్తారని, ఆరోగ్యశ్రీ గరిష్ట పరిమితిని రూ.15 లక్షలకు పెంచుతున్నారని తెలిపారు. మేనిఫెస్టో లోని అన్ని అంశాలను ప్రజలకు వివరిస్తూ ఈ నెల 30 న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ఆల వెంకటేశ్వర్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ ఫలాలు అందిస్తూ హక్కున చేర్చుకుంటున్న తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి పట్టం కడతామని బ్రహ్మరథం పడుతున్న ప్రజలు పనిచేసిన ప్రభుత్వానికి ఓటు వేసి మళ్లీ గెలిపిస్తామని ప్రజలు విశ్వాస వ్యక్తం చేస్తున్నారు.
Also Read : వైభవంగా కొనసాగుతున్న కార్తిక బ్రహ్మోత్సవాలు
ప్రచార కార్యక్రమంలో అడ్డాకుల మండల ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళా నాయకులు వైస్ ఎంపీపీ రాధిక, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు ఆవుల సుజాత, శృతి రెడ్డి, ఫాతిమా బేగం, అడ్డాకుల గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మహిళలు,పార్టీ యువ శ్రేణులు, జాంగీర్ ఘోరి, పవన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube