నామినేషన్‌ వేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా

నామినేషన్‌ వేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా

2
TMedia (Telugu News) :

నామినేషన్‌ వేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా
టి మీడియా,జూలై19,ఢిల్లీ: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, రాజస్థాన్‌ మాజీ గవర్నర్‌ మార్గరెట్ అల్వా.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదిరుల సమక్షంలో ఆమె నామినేషన్ సమర్పించారు. నామినేషన్‌ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌(తెలంగాణ) దూరంగా ఉండడం గమనార్హం. మద్దతు విషయంలో ఇంకా తమ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీలు జాతీయ మీడియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

 

 

Also Read : గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులపై చర్యలు తీసుకోండి

మరికొన్ని పార్టీల నుంచి కూడా అల్వాకు మద్దతు ఇచ్చే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇక ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌కర్‌ సోమవారం నాడే ప్రధాని మోదీ సమక్షంలో నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్లకు ఇవాళే తుది గడువు కాగా, ఆగష్టు 6న దేశ 14వ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది. ఆగష్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube