నాగచైతన్య కొత్త చిత్రం ప్రారంభం
-వైరల్ అవుతున్న లాంఛనింగ్ ఫోటోలు
టి మీడియా, జూన్ 23, సినిమా: అక్కినేని నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని నాగచైతన్య. రొటీన్‌కు భిన్నంగా కథలను ఎంచుకుంటూ సినీరంగంలో దూసుకుపొతున్నాడు. ‘లవ్‌స్టోరి’, ‘బంగార్రాజు’ వంటి రెండు వరుస విజయాలతో టైర్-2 హీరోలలో టాప్ ప్లేస్‌లో నిలిచాడు. ప్రస్తుతం ఈయన ‘మానాడు’ ఫేం వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ద్విభాష చిత్రాన్ని చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా పూజా కార్యక్రామాలను జరుపుకుంది.
Also Read : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోదాలు
కాగా లాంఛనింగ్ కార్యక్రమానికి నటులు రానా దగ్గుబాటి, శివ కార్తికేయన్, దర్శకులు భారతిరాజా, బోయపాటి శ్రీను గెస్ట్లుగా వచ్చారు. రానా కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. బోయపాటి క్లాప్ కొట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తుంది. ఇళయరాజా, యువన్ శంకర్ రాజాలు సంగీతం సమకూర్చుతున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నాడు. నాగచైతన్య ప్రస్తుతం ‘ధూత’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్ నిర్మిస్తుంది. దీనితో పాటుగా ఈయన నటించిన ‘థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’లు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube