ఘనంగా జన్మదిన వేడుకలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 13 వనపర్తి : నాగర్ కర్నూల్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు బి.రాములు జన్మదిన వేడుకలు వనపర్తి పార్టీ కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు నందిమల్ల అశోక్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో సంక్షోభాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తున్న బి.రాములు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. రాములు మాట్లాడుతూ ఇంతకాలం నాకు సహకరించిన రావులకు నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి సభ్యులు వెంకటయ్యయాదవ్, దస్తగిరి, నందిమల్ల రమేష్, హుస్సేన్ ,బాలయ్య, బాలరాజు, డి.బాలరాజు, ముద్దుసర్, నారాయణ, బండారు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Nagar Kurnool Telugu Desam Party Parliament President B.ramu’s birthday celebrations were held at the Vanaparthi town.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube