ఘనంగా నాగోబా పునఃప్రతిష్ఠ..

దీపం వెలిగించిన మెస్రం ఆడపడుచులు

1
TMedia (Telugu News) :

ఘనంగా నాగోబా పునఃప్రతిష్ఠ..

-దీపం వెలిగించిన మెస్రం ఆడపడుచులు

-ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి

లహరి, డిసెంబర్19,ఆదిలాబాద్ : గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా జాతర లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆదివాసుల ఆది దేవుడిగా భావించే.. నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆదిలాబాద్ జిల్లా. ఘనంగా నాగోబా పునఃప్రతిష్ఠ.. దీపం వెలిగించిన మెస్రం ఆడపడుచులు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మంత్రి.గిరిజన సంస్కృతికి ప్రతీకగా నిలిచే నాగోబా లో కీలక ఘట్టం చోటుచేసుకుంది. ఆదివాసుల ఆది దేవుడిగా భావించే.. నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించే కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నాగోబాను పునఃప్రతిష్ఠించారు.

మెస్రం వంశీయుల ఆచార వ్యవహారాల ప్రకారం ఉదయం 4 గంటలకు ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు నాలుగు రాష్ట్రాల నుంచి మెస్రం వంశస్థులు తరలి వచ్చారు. మెస్రం పెద్దల సమక్షంలో నాగశేషునికి ఆలయ పీఠాదిపతి ఆద్వర్యంలో కొనసాగుతున్న పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి మెస్రం వంశంలోని 22 తెగలకు చెందిన భక్తులు హాజరయ్యారు. నాగోబా వంశం ఏడు దేవుళ్ల కుటుంబాలైన మడావి, మర్సుకొల, పుర్కా, కుర్వేత, పంద్రా, వెడ్మ, మెస్రం వంశస్థుల ఆడపడుచుల తో ఉదయం 4 గంటల నుండి కొనసాగుతున్న ఆలయ మండప పూజలు జరిగాయి. నేటి అర్థరాత్రితో నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు ముగియనున్నాయి. మరోవైపు.. నాగోబాను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. శనివారం నాగోబా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగోబా ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ కమిటీ, ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్ రావ్ ఆద్వర్యంలో మంత్రికి సన్మానం నిర్వహించారు. రూ.5 కోట్ల సొంత డబ్బులతో ఆలయాన్ని పునర్ నిర్మించుకోవడం మెస్రం వంశీయుల ఐక్యతకు నిదర్శమని మంత్రి ఇంద్రకరణ్ హర్షం వ్యక్తం చేశారు.

Also Read : పెద్దవారి పాదాలకు నమస్కారం చేయడం వలన కలిగే ఫలితాలు

యాదాద్రి ఆలయాన్ని ప్రభుత్వ నిధులతో నిర్మిస్తే, మెస్రం వంశస్థులు సొంత డబ్బులతో నాగోబా ఆలయాన్ని పూర్తి చేశారు. వారి భక్తి ని నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున రూ.10 కోట్లు మంజూరు చేశారు. మరిన్ని నిధులపై దృష్టి సారిస్తాం. వచ్చే నెలలో ప్రారంభమయ్యే నాగోబా జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ముత్నూరు నుంచి కేస్లాపూర్‌ వరకు తారు రోడ్డుకు మరమ్మతులు చేయిస్తాం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube