నకిలి ఫేస్బు క్ నిందితుడి పై పిడియాక్టు

హైదరా బాద్ నకిలీ ఫేస్‌బుక్‌ ఐడీతో..* మహిళలకు వేధింపులుNov 21 2020 *రాచకొండలో సైబర్‌ నేరగాడిపై మొదటి పీడీయాక్టు

హైదరాబాద్‌ సిటీ, నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించి.. నగ్న చిత్రాలు, వీడియోలతో మహిళలను లైంగికంగా వేధిస్తున్న సైబర్‌ నేరగాడు, బీఫార్మసీ స్టూడెంట్‌పై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ పీడీయాక్టు నమోదు చేశారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో సైబర్‌ నేరగాడిపై పీడీయాక్టు ప్రయోగించడం ఇదే ప్రథమం. సీపీ తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌ కర్నూల్‌ జిల్లా లింగాలకు చెందిన మోట దుర్గాప్రసాద్‌.. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో బీఫార్మసీ చదివాడు. ఈ క్రమంలో ఓ యువతిని ప్రేమిస్తున్నట్లు చెప్పాడు. కానీ అతని ప్రేమను ఆ యువతి తిరస్కరించింది. దాంతో ఆమెతో పాటు మొత్తం మహిళలపైనే కోపం పెంచుకున్నాడు. గర్ల్స్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా సృష్టించాడు.

అనేక మంది మహిళలకు ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపాడు. యాక్సెప్టు చేసిన మహిళలతో అమ్మాయిగా చాటింగ్‌ చేసేవాడు. నగ్న చిత్రాలు, బూతు వీడియోలు పంపేవాడు. వారి ఫోన్‌ నంబర్‌లు సేకరించి వీడియోకాల్‌ చేసేవాడు. ముఖం కనిపించకుండా జాగ్రత్త పడుతూ తన బాడీ మొత్తాన్ని చూపించి పైశాచిక ఆనందం పొందేవాడు. దాంతో బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రంగంలోకి దిగి.. నిందితున్ని ఆటకట్టించి కటకటాల్లోకి నెట్టారు. అప్పటికే నల్గొండ, సైబరాబాద్‌లో రెండు సైబర్‌ క్రైం కేసులు నమోదైనట్లు పోలీసుల విచారణలో తేలింది. దాంతో సీపీ మహేష్‌ భగవత్‌ నిందితుడిపై పీడీయాక్టు నమోదు చేశారు.