జెట్పీటీసీ ప్రియాంక – రామకృష్ణ నిశ్చితార్థ వేడుకకు హాజరై,ఆశీర్వదించిన ఎంపీ నామ

జెట్పీటీసీ ప్రియాంక - రామకృష్ణ నిశ్చితార్థ వేడుకకు హాజరై,ఆశీర్వదించిన ఎంపీ నామ

0
TMedia (Telugu News) :

జెట్పీటీసీ ప్రియాంక – రామకృష్ణ నిశ్చితార్థ వేడుకకు హాజరై,ఆశీర్వదించిన ఎంపీ నామ

టీ మీడియా, నవంబర్ 25, ఖమ్మం బ్యూరో : ఖమ్మం గట్టయ్య సెంటర్ లోని జీఎంఆర్ ఫంక్షన్ హాలులో శనివారం రఘునాధ పాలెం జెట్పీటీసీ మాలోత్ ప్రియాంక – రామకృష్ణ నిశ్చితార్ధ వేడుకలు జరగగా, బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కార్యక్రమానికి హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపి, దీవెనలు అందజేశారు. ఈ సందర్భంగా వధూవరుల కుటుంబ సభ్యులతో కూడా నామ మాట్లాడి, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని, శుభాశీస్సులు అందజేశారు. కార్యక్రమంలో బోయినపల్లి కృష్ణమూర్తి, చిత్తారు సింహాద్రి యాదవ్, నామ సేవా సమితి నుంచి పాల్వంచ రాజేష్, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ తో పాటు నూతన వధూవరుల కుటుంబ సభ్యులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Also Read : కేసీఆర్ కు అండగా నిలవాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube