పలు కుటుంబాలకు నామ పరామర్శ

పలు కుటుంబాలకు నామ పరామర్శ

0
TMedia (Telugu News) :

 

పలు కుటుంబాలకు నామ పరామర్శ
టీ మీడియా, సెప్టెంబర్ 17,మధిర : టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు శుక్రవారం మధిర నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రతో కలిసి పర్యటించి, పలు బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఇటీవల మృతి చెందిన మధిర 20వ వార్డు కౌన్సిలర్ ముత్తవరపు రాణి ఇంటికెళ్ళి, మృతురాలి భర్త ప్యారీని, వారి ఇద్దరి కుమారులు, ఇతర కుటుంబ సభ్యులతో నామ మాట్లాడి, సానుభూతి వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా నామ , వద్ధిరాజు రవిచంద్ర మృతురాలి చిత్ర పటానికి పూలమాల వేసి, శ్రద్ధాంజలి ఘటించి, నివాళులు అర్పించారు.

Also Read : తెలంగాణ జాతీయ స‌మైక్య‌తా వ‌జ్రోత్స‌వ శుభాకాంక్ష‌లు

ఆమె పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ లింగాల కమలరాజు, స్థానిక ప్రజా ప్రతినిధుల, నాయకులు పాల్గొన్నారు. అంతకముందు మధిర మండలం దేశినేనిపాలెంలో మృతి చెందిన పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు పాలేటి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube