ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి

రూ.75 వేలు చోరీ!

1
TMedia (Telugu News) :

ఎంపీ నామా నాగేశ్వరరావు కుమారుడిని కత్తితో బెదిరించి..

-రూ.75 వేలు చోరీ!
టి మీడియా, ఆగస్ట్ 2,హైద్రాబాద్:ఎంపి నామా కుమారుడిని కత్తితో బెదిరించిన కొందరు దుండగులు.. రూ.75 వేలు లాక్కొని పరారయ్యారు. ఈ ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. టోలిచౌకి వద్ద పృథ్వీ తన వాహనంలో వెళ్తుండగా.. దాన్ని ఇద్దరు దుండగులు అడ్డుకున్నారు. బలవంతంగా కారులో చేరిన వాళ్లు.. కాసేపు కారులో కూర్చొని ఊరంతా తిరిగారు.

Also Read ; టీటీడీ నిధులతో వసతి గృహాల నిర్మాణం

వాహనంలో నుంచి పృథ్వీని దిగకుండా అడ్డుకొని, కాసేపు అటూఇటూ తిప్పారు. అనంతరం కత్తితో బెదిరించి రూ.75 వేలు లాక్కొని పంజాగుట్ట వద్ద దిగి పరారయ్యారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలిపిన పృథ్వీ.. శనివారం రాత్రి పంజాగుట్ట పీఎస్‌లో కేసు పెట్టారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube