వికలాంగుల కాలనీ నామకరణ

వికలాంగుల కాలనీ నామకరణ

1
TMedia (Telugu News) :

వికలాంగుల కాలనీ నామకరణ

టి మీడియా అక్టోబర్ 29 మహబూబాబాద్ జిల్లా : ఈరోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని గౌ, శ్రీ మందకృష్ణ మాదిగ స్థాపించిన వికలాంగుల హక్కుల పోరాట సమితి(VHPS) ఆధ్వర్యంలో సంవత్సర కాలంతో గుడిసెలు వేసుకొని ఉంటున్న వికలాంగుల కాలనీలో ఈరోజు లుయి బ్రెయిల్( వికలాంగుల కాలనీ) గా నామకరణ బోర్డును VHPS తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం కాశిం ఆవిష్కరణ మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) జండా ఆవిష్కరించారు, మహాజన సోషలిస్టు పార్టీ (MSP) మహబూబాబాద్ జిల్లా కో ఆర్డినేటర్ గుగ్గిళ్ల పీరయ్య మాదిగ ఎంఎస్పి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది,అనంతరం మాట్లాడుతూ నిరుపేదలైనటువంటి వికలాంగుల ను వారిని కన్న తల్లిదండ్రులే చీదరించుకునే ఈ రోజుల్లో అలాంటి వికలాంగులని అక్కున చేర్చుకుని పెద్దన్నగా నిలిచిన ఏకైక వ్యక్తి మందకృష్ణ మాదిగ మాదిగ అని అన్నారు, అదే కాకుండా వారికి వాళ్ళుప్రభుత్వ భూమిలో వేసుకున్న ఇంటి స్థలాల లోనే డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించి వారికి కరెంటు గాని, రోడ్లు గాని కనీస సౌకర్యాలు కల్పించాలని అన్నారు.

Also Read : జనసేన విద్యార్థి విభాగం కమిటీ

ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి దుప్పెల్లి అనిల్ జిల్లా కన్వీనర్ చాగంటి రమేష్ ఎంఎస్పీ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు ఎండి రజియా ఎంఎంఎస్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కత్తుల రేణుక,MRPS జిల్లా కో కన్వీనర్ పోలేపాక ప్రవీణ్,MSP జిల్లా నాయకులు మిడతపల్లి యకయ్య,తీగల ప్రేమ్ సాగర్, పోలేపాక ఎల్లయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా కన్వీనర్ చెలగల వెంకన్న, జిల్లా నాయకులు వినోద్ రెడ్డి, వెంకటేశ్వర్లు, రవికుమార్, కుమార్,MSP మహబూబాబాద్ నియోజకవర్గ ఇంచార్జి ఎండి పాషా, పల్లపు మల్లయ్య, పెదమాముల అంజిబాబు,పులి సతీష్,మంద సంపత్, సుమిత్ర, గుండెల సరిత, గుంటుక రేణుక, చంద్రకళ, దైద వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube