నమ్మ చెరువుకట్ట అక్రమణ ఆపాలి

నమ్మ చెరువుకట్ట అక్రమణ ఆపాలి

1
TMedia (Telugu News) :

నమ్మ చెరువుకట్ట అక్రమణ ఆపాలి

టీ మీడియా, డిసెంబర్ 5, వనపర్తి బ్యూరో : వనపర్తి ప్రజల కోరిక మేరకు రాజీవ్ గృహకల్ప ను సోమవారం పరిశీలించడానికి వెళ్లిన అఖిలపక్ష ఐక్యవేదికకు రాజీవ్ స్వగృహ పక్కనున్న నమ్మ చెరువు కట్ట అన్యాక్రాంతం అవుతుందని, దాని వెనుక పెద్దల హస్తం ఉందని, మీరు కాపాడాక ఇప్పటివరకు బాగానే ఉందని, కానీ దానికి చుట్టుముట్టు రోడ్లు వేసి హడావుడి చేస్తున్న విషయాలు చూస్తే, వెనక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు మళ్లీ దీంట్లో భాగస్వాములు అవుతున్నారని, కనుక ఈ స్థలాన్ని కాపాడాలని వారు కోరితే అఖిలపక్ష ఐక్యవేదిక పరిశీలించిన తర్వాత.ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుండి ఎక్కడ అభివృద్ధి లేకుండా ఉన్నవార్డు ఒక్కసారిగా ఎస్టీ నిధులతో నమ్మ చెరువు కుంట చుట్టుపక్కల రోడ్లన్నీ నమ్మ చెరువు కుంట లింకు కలపడాన్ని చూస్తే అనుమానం కలుగుతుందని దీని వెనక ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు అప్పట్లో చదును చేసిన భూమి రద్దు చేసుకోకుండా ఈ మధ్య మళ్లీ ప్రారంభం చేస్తారని తెలుస్తుందని,

Also Read : మెడిసిన్ సీట్ సాధించిన విద్యార్థికి సన్మానం

తెలిసి మేము రావడం జరిగిందని, కనుక వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆ రోజు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నమ్మ చెరువు కుంటలో పత్రికా విలేకరులకు పట్టాలు ఇవ్వాలని కోరుతున్నామని, కనుక మంత్రి వెంటనే కల్పించుకుని 86 సర్వేనెంబర్ లో మిగిలిన భూమిని, నమ్మ చెరువుకట్టలో ఉన్న భూమిని విలేకరులకు పట్టాలుగా ఇవ్వాలని కోరుతున్నామని మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సతీష్ యాదవ్, ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, నందిమల్ల చంద్రమౌళి, పొట్టినేని గోపాలకృష్ణ నాయుడు, సూర్యవంశం సతీష్, అవినాష్ బలపీరు తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube