‘నందిని’ లఘు చిత్రం ఆవిష్కరణ

దర్శకుడు మహేష్ ను అభినందించిన అతిథులు

0
TMedia (Telugu News) :

‘నందిని’ లఘు చిత్రం ఆవిష్కరణ

– దర్శకుడు మహేష్ ను అభినందించిన అతిథులు

టి మీడియా, జనవరి 19, గోదావరిఖని : గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో లఘు చిత్రాల నిర్మాణం ఊపందుకుందని, చిన్న చిత్రంలో పెద్ద సందేశాన్ని ఇవ్వడానికి కథా రచయితలు,దర్శకులు చేస్తున్న కృషి అభినందనీయమని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్ నాయకులు మిర్యాల రాజిరెడ్డి అన్నారు.స్థానికుడు మహేష్ గొట్టె నిర్మించి, దర్శకత్వం వహించిన ‘నందిని’ లఘు చిత్రాన్ని మార్కండేయ కాలనీలోని రెయిన్ బో స్కూల్లో రిలీజ్ చేసి,ఆ చిత్రాన్ని ఆద్యంతం వీక్షించారు.అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ… గోదావరిఖని పారిశ్రామికప్రాంతం నుండి ఎంతోమంది కళాకారులు బుల్లితెర నుండి వెండితెర వరకు ఎదిగారని,సాంకేతిక విలువలతో లఘు చిత్రాలు నిర్మిస్తున్న వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు.ఆకర్షణలకన్నా ముందుగా జీవితంలో స్థిరపడడం ముఖ్యమని,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సాధించి,ప్రేమించిన అమ్మాయిని పెళ్ళి చేసుకున్న వారి జీవితం ఆనందమయంగా సాగుతుందనే కథాంశంగా నిర్మించిన ‘నందిని’ లఘు చిత్రం చక్కటి సందేశాన్ని ఇచ్చిందన్నారు.

Also Read : విప‌క్షాలు ఒక్క‌టై ముందుకు సాగాలి: బీహార్ సీఎం

ఈ చిత్రాన్ని నిర్మించిన మహేష్ గొట్టె, నటీనటులు,సాంకేతిక వర్గాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్, సింగరేణి అధికారి మాధవరెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ దయానంద్ గాంధీ, పాఠశాల నిర్వాహకులు పిఎస్ అమరేందర్, సీనియర్ కళాకారులు దామెర శంకర్, మేజిక్ రాజా,చంద్రపాల్,చిత్ర దర్శకులు మహేష్ గొట్టె, నటీనటులు,సాంకేతిక వర్గం,సంజిత్ రాజ్, మనీషా,సిరిశెట్టి తిరుపతి, మూలశంకర్,రాజేష్ ఆన్రెడ్డి, రహీం,సందీప్ ఆరె, తిప్పబత్తిని అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube