వన్ టైం సెటిల్మెంట్ – సంపూర్ణ గృహ హక్కు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, నవంబర్ 18, మహానంది:

మహానంది మండలం లోని బుక్కాపురం రైతు భరోసా కేంద్రం నందు ” జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం “(వన్ టైం సెట్టెల్మెంట్ )ను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశాల మేరకు గురువారం మండల స్థాయిలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ సెక్రటరీలు, విఆర్ఓలతో సమీక్షా సమావేశం నిర్వహించిన
మండల నోడల్ అధికారి కె.వి.బ్రహ్మం

ఈ సందర్బంగా మండల నోడల్ అధికారి మాట్లాడుతూ ఓటియస్ పథకంను వాలంటీర్స్ ద్వారా పూర్తి స్థాయిలో ప్రజల లోకి తీసుకెళ్లి, అర్హత గల లబ్ధిదారులు అందరూ ఈ అవకాశం ను సద్వినియోగం చేసుకోవాలని, అందుకోసం ప్రతి సచివాలయం నకు ఒక మండల స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్ గా నియమించామని, వీరందరు ఈ పథకం పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి అభివృద్ధి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్బ రాజు, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ రెడ్డి, విస్తరణ అధికారి పి ఆర్ & ఆర్ డి శివ నాగ జ్యోతి, మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ రామ సుబ్బయ్య, మండల ఇంజనీరింగ్ అధికారి రాముడు, అసిస్టెంట్ ఇంజనీర్ వాసు దేవుడు, మండల వ్యవసాయ అధికారి సుబ్బారెడ్డి,
గాజులపల్లి డాక్టర్ కరుణాకర్,
తదితర అధికారులు పాల్గొన్నారు.

Nandyala Sub-collector Chahat
A review meeting was held on Thursday at the Bukkapuram Farmer’s Assurance Center in the Mahanadi Zone .
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube