నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత

నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత

0
TMedia (Telugu News) :

            నారా లోకేష్ పాదయాత్రలో ఉద్రిక్తత

టీ మీడియా, ఏప్రిల్ 21, ఆదోని: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర శుక్రవారం ఆదోని నియోజకవర్గంలో ఆ పార్టీ ఇన్చార్జి మీనాక్షినాయుడు ఆధ్వర్యంలో రెండో రోజు జరిగింది. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మీదుగా పట్టణంలోకి భీమస్ సర్కిల్లోకి లోకేష్ యువగలం యాత్ర రాగానే గో బ్యాక్ అంటూ వైఎస్సార్సీపీ కార్యకర్తలు నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అంతకుముందు వైఎస్ఆర్ సీపీ నాయకులు దేవా, సురేష్, కిషోర్ ,దుర్గప్ప లక్ష్మీనారాయణ, తయన్న కౌన్సిలర్ అశోక్, వసీం ఆధ్వర్యంలో ప్లే కార్డులు ప్రదర్శిస్తూ మూడు రాజధానులకు మద్దతుగా నినాదాలు చేస్తూ రైల్వే స్టేషన్ రోడ్డులో కోట్ల విగ్రహం వద్ద నిరసన చేశారు. అక్కడికి టిడిపి నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి పోటాపోటీగా సీఎం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా హాయ్ టిడిపి కన్వీనర్ సజ్జత్ హుస్సేన్ ఇతరులు భారీ ఎత్తున నినాదాలు చేశారు ఈ నేపథ్యంలోనే తోపులాట జరిగింది .అప్రమత్తమైన పోలీసులు ఇరువురిని చెదరగొట్టేందుకు అతి కష్టం మీద యత్నించారు ఏమాత్రం ఆదమరిచిన పరిస్థితి చేయి దాటి తీవ్ర గర్షణకు అవకాశం ఉండేది.

AlsoRead:గోద్రా రైలు దహనం కేసు.. ఎనిమిది మందికి బెయిల్‌

 

టిడిపి వైసిపి వర్గీల మధ్య తీవ్ర పదజాలం మాట్లాడుతూ ఒకరికొకరు దూషించుకున్నారు డిఎస్పి వినోద్ కుమార్ ,సీఐలు శ్రీరామ్ ,శ్రీనివాస్ నాయక్ ఈశ్వరయ్య, ఎస్సై లు విజయలక్ష్మి చదరగొట్టారు . వైసిపి వర్గీలను రాజశ్రీ హోటల్ వద్ద ఉంచారు. ఈ సందర్భంలోనే లోకేష్ పాదయాత్ర కోట్ల కూడలి మీదుగా మున్సిపల్ రోడ్డులో సాగుతుండగా వైసిపి నాయకుడు పెద్ద రెడ్డి శ్రీనివాస్ రెడ్డి లోకేష్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో అందరూ ఉలిక్కిపడ్డారు ఒక్కసారిగా టిడిపి నాయకులు కార్యకర్తలు లీలలు కేకలు వేస్తూ భయానిక వాతావరణం చోటుచేసుకుంది గుర్తుతెలియని వ్యక్తులు పెద్ద రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పై భౌతిక దాడికి దిగారు శ్రీనివాస్ రెడ్డి తప్పించుకునే ప్రయత్నంలో ఓ దుకాణంలోకి దాక్కవలసిన పరిస్థితి దాపురించింది పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి చదరగొట్టి పరిస్థితిని చెక్క దిద్దారు వేలాదిమంది కార్యకర్తలు నాయకులు హాజరవుతున్న సందర్భంగా అధికార పార్టీ నాయకులు ఇలా నిరసన చేపట్టడం ఏమిటని పలువురు నిందించారు నినాదాలు చేసుకుంటూ నారా లోకేష్ పాదయాత్ర ముందుకు సాగింది

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube