సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం.. కే.విశ్వనాథ్: ప్రధాని మోదీ
సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం.. కే.విశ్వనాథ్: ప్రధాని మోదీ
సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం.. కే.విశ్వనాథ్: ప్రధాని మోదీ
టీ మీడియా, ఫిబ్రవరి 3, న్యూఢిల్లీ : ప్రముఖ దర్శకులు కే.విశ్వనాథ్ మృతిపట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి బాధాకరమని అన్నారు. సినీ ప్రపంచంలో ఒక దిగ్గజమని చెప్పారు. సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారని వెల్లడించారు. ఆయన సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను ఆకర్షించాయన్నారు. ఆయ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘కే.విశ్వనాథ్ గారి మృతిపట్ల విచారం వ్యక్తంచేస్తున్నాను. అతను సినీ ప్రపంచంలో ఒక దిగ్గజం, సృజనాత్మక దర్శకుడిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా సినీలోకంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. వివిధ ఇతివృత్తాలతో తీసిన అతని సినిమాలు దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించాయి. అతని కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి.’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.