ప్రపంచంలో పొరపాటున కూడా నిజాలు మాట్లాడని ఏకైక ప్రధాని నరేంద్రమోదీ

ప్రపంచంలో పొరపాటున కూడా నిజాలు మాట్లాడని ఏకైక ప్రధాని నరేంద్రమోదీ

0
TMedia (Telugu News) :

ప్రపంచంలో పొరపాటున కూడా నిజాలు మాట్లాడని ఏకైక ప్రధాని నరేంద్రమోదీ

– జైరామ్‌ రమేశ్‌

టీ మీడియా, నవంబర్ 21, జైపూర్‌ : రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో నాలుగు రోజుల సమయం మాత్రమే ఉండటంతో రాజకీయ వేడి తీవ్ర స్థాయికి చేరుకుంది. అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రెండు పార్టీల నాయకుల విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయం రసవత్తరంగా మారింది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ప్రధాని నరేంద్రమోదీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లో గత ఐదేండ్లుగా తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము ప్రజలను కోరుతున్నామని, బీజేపీ నేతలు మాత్రం విద్వేష ప్రసంగాలు, అసత్యపు ప్రచారంతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నదని జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. ఈ ప్రపంచంలో పొరపాటున కూడా నిజాలు మాట్లాడని ఏకైక ప్రధాని నరేంద్రమోదీ అని విమర్శించారు. గడిచిన పదేళ్లలో నరేంద్రమోదీ తీసుకొచ్చిన అతిపెద్ద పథకం పేరు ‘ప్రైమ్‌ మినిస్టర్ జూట్‌ బోలో యోజన’ అని ఆయన మండిపడ్డారు.

Also Read : ల‌ష్క‌రే తోయిబాపై బ్యాన్ ప్ర‌క‌టించిన ఇజ్రాయిల్‌

తాము రాష్ట్రంలో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరిస్తున్నామని, మళ్లీ గెలిపిస్తే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని, అర్హులైన మహిళలకు నెలకు రూ.2,500 భృతి చెల్లిస్తామని చెబుతున్నామని జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. ప్రధాని మోదీ, ఇతర బీజేపీ నేతలు మాత్రం రాజస్థాన్‌లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అసత్యపు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో, మధ్యప్రదేశ్‌లో అత్యాచారాలు జరగడం లేదా..? అని ప్రశ్నించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube