3 నుంచి ధర్మపురి నర్సన్న బ్రహ్మోత్సవాలు..
లహరి, ఫిబ్రవరి 28, ధర్మపురి : ‘కొబ్బరి బెల్లాలివిగో నారసయ్య.. కోటి దండాలయ్యో నారసయ్య.. నీ క్షేత్రానికి వస్తున్నామయ్యో నారసయ్యా.. గండాలు కడతేర్చయ్యో నారసయ్య..’ అంటూ భక్తులు ప్రతి నిత్యం ధర్మపురి క్షేత్రానికి వస్తూ ఉంటారు. జగిత్యాల జిల్లా కేంద్రానికి 29 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి 70 కిలోమీటర్ల దూరాన గోదావరి తీరాన ఉన్న ధర్మపురి క్షేత్రం దక్షిణ భారతదేశంలోని 108 దివ్యక్షేత్రాలలో ఒక మహాపుణ్య క్షేత్రం. ప్రధానంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు, మసీదులు పక్కపక్కనే ఉండి వైష్ణవ, శైవ, ముస్లిం మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ క్షేత్రంలో శ్రీబ్రహ్మదేవుడు, విష్ణు స్వరూపుడు అయిన శ్రీలక్ష్మీనారసింహస్వామి, శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురూ కొలువు దీరిన ఈ క్షేత్రాన్ని త్రిమూర్తి క్షేత్రమని కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో భారత దేశంలో ఎక్కడాలేని విధంగా శ్రీయమధర్మరాజు ఆలయం ఉంది.
Also Read : సుప్రీంను ఆశ్రయించిన మనీష్ సిసోడియా
ధర్మపురికి వచ్చిన వారికి యమపురి ఉండదు అనే నానుడి కూడా ఉంది. ఈ ధర్మపురి ఆలయం ఇప్పుడు బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. పాల్గుణ మాస శుద్ధ ఏకాదశి రోజు అనగా మార్చి 3 నుంచి 15 వరకు ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. రాజగోపురాలకు రంగులు వేసి విద్యుద్దీపాలతో అలంకరించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube