నార్వే నైట్ క్లబ్లో కాల్పులు.. ఇద్దరు మృతి
టి మీడియా,జూన్,25,ఓస్లో: నార్వే రాజధాని ఓస్లోలో కాల్పులు కలంకలం సృష్టించాయి. ఓస్లోలోని ఓ నైట్‌క్లబ్‌లో దుండగులు కాల్పులు జరిపారు. దీంతో ఇద్దరు మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. శనివారం నగరంలోని ప్రముఖ లండన్ పబ్ (గే బార్, నైట్ క్లబ్)లో కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడించారు.
Also Read : పార్టీల పునాదులు కదులుతున్నాయి
క్లబ్ సమీపంలో ఒక అనుమానితుడిని పట్టుకున్నామని చెప్పారు. దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదన్నారు. గాయపడినవారిని దవాఖానకు తరలించామని వెల్లడించారు
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube