నాసిరెడ్డి సాంబశివ రెడ్డిని ఘనంగా సన్మానించిన మానవ సేవ యూత్
టీ మీడియా డిసెంబర్ 13,పినపాక:
జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి వికాస్ అగ్రి ఫౌండేషన్ స్థాపించి పేద ప్రజలకు చేస్తున్న సేవా కార్యక్రమాలు మరువ లేనివని మానవ సేవ యూత్ వ్యవస్థాపకులు కర్రీ రామ్మోహన్ అన్నారు
సోమవారం వికాస్ అగ్రి ఫౌండేషన్ కార్యాలయంలో మానవ సేవ యూత్ ఆధ్వర్యంలో సాంబశివ రెడ్డిని శాలువా జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
అనంతరం మిఠాయిలు తినిపించారు.
ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ… రైతుల కోసం సాంబశివ రెడ్డి నిరంతరం జరుపుతున్న కృషి మరువలేనిది అన్నారు. సామాజిక సేవలో ముందుండే వారిని గుర్తించి సత్కరించుకోవడం ద్వారా వారిని మరింత ప్రోత్సహించేందుకు తమ మానవ సేవ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు సన్మానించడం జరిగిందని తెలిపారు.
కరోనా కష్టకాలంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులను అందించడం, పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు బ్యాగులు పంపిణీ చేయడం, పాఠశాలకు బెంచీలను పంపిణీ చేయడం రైతులకు ఆధునిక సేద్యం కోసం నిత్యం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వంటివి తమను ఎంతో ఆకట్టుకున్నాయన్నారు.సమాజసేవలో ప్రతి ఒక్కరు ముందుండాలని రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా సన్మాన గ్రహీత నాసిరెడ్డి సాంబ శివ రెడ్డి మాట్లాడుతూ…. సమాజంలో పేదలను ఆదరించడానికి తమ వికాస్ ఆగ్రి పౌండేషన్ తో పాటు మానవ సేవ యూత్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. తనను మరింత బాధ్యత పెంచేలా ప్రోత్సహించేందుకు ముందుకొచ్చిన మానవతా యూత్ సభ్యులను ఆయన అభినందించారు .
ఈ కార్యక్రమంలో మానవ సేవ యూత్ అధ్యక్షుడు జూపూడి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి శెట్టిపల్లి ముకుందం, సహాయ కార్యదర్శి బోడ ప్రవీణ్, ఉపాధ్యక్షులు సంతోష్, సభ్యులు కూకట్ల శ్రీను, యర్రం శ్రావన్ కుమార్, పుల్లూరి తిరుపతి ,బేత శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.