లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం

0
TMedia (Telugu News) :

టీ మీడియా అశ్వారావుపేట డిసెంబర్ 23

నియోజకవర్గ కేంద్రంలోని స్థానిక
రైతు భవనములో గురువారం జాతీయ రైతు దినోత్సవాన్ని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అశ్వరావుపేట మరియు దమ్మపేట మండలం లోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారికి పంటలపై అవగాహన సదస్సు నిర్వహించి అనంతరం ఉత్తమ రైతులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు చలపతిరావు మాట్లాడుతూ దేశానికి వెన్నుముక రైతే అని, రైతుల సంక్షేమానికి ఎంతో కృషిచేసిన మన భారతదేశ మాజీ ప్రధానీ చౌదరి చరణ్ సింగ్ గారి జన్మదినాన్ని జాతీయ రైతు దినోత్సవం గా జరుపుకోవడం చాలా ఆనందదాయకమని తెలిపారు.రైతులకు వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు పలువురు మాట్లాడుతూ వ్యవసాయం లోని మెలుకువలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పంట మార్పిడి విధానాన్ని, భూ పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా వ్యవసాయ అధికారులు సూచించిన పంటలు వేసి మంచి ఫలసాయాన్ని పొందాలని, సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి వివరించారు.

అలాగే వ్యవసాయంలో ఎంతో అనుభవం గడించిన రైతులు తమ స్వీయ అనుభవాన్ని, వ్యవసాయం రంగంలోని లాభనష్టాల గురించి చర్చించడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు లయన్స్ క్లబ్ అశ్వరావుపేట వారిని అధికారులు మరియు రైతులు ఎంతో కొనియాడారు. ఇటువంటి అవగాహన సదస్సుల వలన రైతుల మనోధైర్యాన్ని పెంచవచ్చని అలాగే వ్యవసాయ రంగంలోని సాధక బాధలు ఒకరి ఒకరికి తెలుస్తాయని తెలిపారు ఈ కార్యక్రమంలోఎంపీపీ శ్రీరాంమూర్తి, జడ్పిటిసి వరలక్ష్మి, నిర్మల పుల్లారావు, వ్యవసాయ శాఖ ఏడి అఫ్జల్ బేగం, స్థానిక వ్యవసాయ అధికారి నవీన్, ఉద్యాన శాఖ అధికారి సందీప్, వ్యవసాయ కళాశాల సైంటిస్ట్ ప్రొఫెషనల్ రాంప్రసాద్, లయన్స్ జిల్లా సభ్యులు యు.ఎస్ ప్రకాష్ రావు, జూపల్లి బ్రహ్మారావు, కోటగిరి మోహన్ రావు, వీరభద్ర రావు నూతక్కి నాగేశ్వరావు,వెంకటేశ్వర రావు, చక్రధర్ రావు, మల్లికార్జున రావు, కంచర్ల భాస్కర్ రావు, రమేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

National farmer’s day was celebrated under the auspices of the lions club.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube