నేషనల్ హెరాల్డ్ కేసులో హవాలా లావాదేవీలు..
-ఈడీ చేతికి కీలకాధారాలు
టీ మీడియా,ఆగస్ట్ 4, ఢిల్లీ : నేషనల్ హెరాల్డ్ కేసులో హవాలా లింక్‌లు ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గుర్తించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీల వాంగ్మూలాలను పునః పరిశీలించనున్నది. నేషనల్ హెరాల్డ్, దాని అనుబంధ, థర్డ్ పార్టీ సంస్థల మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్లు ఆధారాలు లభించాయని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియా కార్యాలయంలో జరిపిన తనిఖీల్లో కొన్ని పత్రాలు ఈడీ అధికారులకు లభించాయి. ముంబై, కోల్‌కతా వంటి ప్రాంతాల్లోని హవాలా ఆపరేటర్లతో లావాదేవీలు నిర్వహించారని ఈడీ వర్గాలు ఆధారాలు సంపాదించాయి.యంగ్ ఇండియా ఆఫీసులో తనిఖీలు, సోదాలు పూర్తయిన తర్వాత ఈడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది.
Also Read : ఆంధ్రా వర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణకు మిస్ సౌత్ ఇండియా కిరీటం
కానీ, అదేమిటన్న సంగతి బయటికి వెల్లడి కాలేదు. యంగ్ ఇండియా నుంచి తాము ఎటువంటి నగదు బెనిఫిట్లు పొందలేదని ఈడీ విచారణలో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చెప్పారని సమాచారం. కానీ యంగ్ ఇండియా కార్యాలయంలో జప్తు చేసిన పత్రాలు పరిశీలించిన మీదట సోనియా, రాహుల్ వాంగ్మూలాలతో సంతృప్తి చెందలేదని, మళ్లీ వాటిని పునఃపరిశీలించాలని ఈడీ అధికారులు అభిప్రాయ పడుతున్నారు.ఢిల్లీ, ముంబై, కోల్‌కతాతోపాటు నేషనల్ హెరాల్డ్‌కు చెందిన 16 ప్రాంతాల్లో మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి పొద్దుపోయే వరకు ఈడీ అధికారులు తనిఖీలు జరిపారు. బుధవారం ఢిల్లీలోని నేషనల్ హెరాల్డ్ భవనంలోని యంగ్ ఇండియా ఆఫీసును ఈడీ సీల్ చేసింది. దీంతో కర్ణాటక పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. ఢిల్లీకి చేరుకున్నారు. సోనియాగాంధీని గత నెల 21న మూడు గంటలు, 26న 6, 27న మూడు గంటలు ఈడీ అధికారులు ప్రశ్నించారు. గత జూన్‌లో ఐదు రోజుల్లో 50 గంటలకు పైగా రాహుల్‌ను ప్రశ్నించారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube