వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ నుండి మైక్ సెట్ బహుకరణ

0
TMedia (Telugu News) :

-జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి

టీమీడియా,నవంబర్21,పినపాక:

పౌరులందరూ సమాజసేవలో ముందుండాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివ రెడ్డి అన్నారు.
ఆదివారం మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామ యువకులకు నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూపాయలు 30 వేల విలువైన మైక్ సెట్ బహుకరణ చేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సాంబశివరెడ్డి మాట్లాడుతూ…. అకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం జంట గ్రామాలలో నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజోపయోగ ప్రభుత్వ కార్యక్రమాలకు ఉచితంగా ఈ మైక్ సెట్ ని వినియోగించుకోవచ్చనని తెలిపారు.
సమాజసేవలో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన వినయ్ కుమార్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి సేవలను సాంబశివ రెడ్డి కొనియాడారు.

ఈ సందర్భంగా విజయ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ… అకినేపల్లి మల్లారం టీ కొత్తగూడెం గ్రామాలలో యువత నిర్వహిస్తున్న వివిధ కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పరంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ఈ మైక్ సెట్ ను ఉపయోగించుకునే విధంగా తన కుమారుడు కీర్తిశేషులు నాసిరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి పేరిట బహూకరించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు నాసిరెడ్డి నాగిరెడ్డి భార్గవ్ రెడ్డి,కృష్ణారెడ్డ,యూత్ ప్రతినిధి గాలి వేణు,వికాస్ ఆగ్రి పౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల శేషారెడ్డి,చెట్టుపల్లి తిరుపతి రావు,యువజన సంఘం సభ్యులు శెట్టిపల్లి బాలు,ఇనుముల వినయ్,బిలపాటి ప్రేమ్ కుమార్,ఇనుముల నరసింహారావు,సురేందర్ రెడ్డి నరసింహా రెడ్డి,నరేందర్ రెడ్డి,షేక్ అజారుద్దీన్,ఖుషిని,లవకుమార్,బొడ్డు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

National Mirchi Task force Director Nasireddy Sambashiva Reddy said that all citizens should take the lead in community service.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube