పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవం
– సైన్స్ ఫెయిర్ ప్రారంభించిన మున్సిపల్ వైస్ చైర్మన్
టీ మీడియా, ఫిబ్రవరి 28, వనపర్తి బ్యూరో : జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా వనపర్తి మున్సిపల్ పరిధిలోని శ్రీ చైతన్య ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సైన్స్ ఫెయిర్ ను వనపర్తి మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, స్థానిక కౌన్సిలర్లు కాగితాల లక్ష్మీనారాయణ, పుట్టపాకల మహేష్, కాగితాల గిరి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులతో సృజనాత్మక శక్తిని వెలికి తీయడంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రదర్శన కార్యక్రమాలు దోహదపడతాయని యాజమాన్యాన్ని కొనియాడారు. చైతన్య పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అనేక రకాల పరిశోధనలు కనిపెట్టి వారి పరిజ్ఞానాన్ని అనేక పరిశోధనల ద్వారా ప్రదర్శనలు నిర్వహించారు. పాఠశాల ఉపాధ్యాయులను యాజమాన్యాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు తల్లి దండ్రులు పాల్గొన్నారు.