ప్రకృతి వ్యవసాయదారుడు కుడుముల వెంకటరామిరెడ్డి
టీ మీడియా, అక్టోబర్ 22, మధిర:
రసాయనాలు లేని పోషకాలు కలిగిన ఆహారం అందించడమే నా లక్ష్యం అని ప్రకృతి వ్యవసాయదారుడు కుడుముల వెంకటరామిరెడ్డి అన్నారు. అదే విధంగా వారు మాట్లాడుతూ…
రసాయన ఎరువులు క్రిమిసంహారక పురుగుల మందులు వాడని అధిక పోషకాలు కలిగిన దేశవాళి వరిని పండించిన ఆహారం అందించే లక్ష్యంతో ఆరు రకాల వరిని ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న రైతు కుడుముల వెంకటరామిరెడ్డి,
ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చెందిన ఇంజనీరింగ్ చదివిన విద్యావేత్త ప్రకృతి వ్యవసాయ దారుడు వెంకటరామిరెడ్డి గత నాలుగు సంవత్సరాలుగా తన వ్యవసాయ క్షేత్రంలో ఎన్నో పోషకాలు కలిగిన దేశవాలి రకాలైన నవారా, మైసూర్ మల్లికా, కాలబట్టి, కుంకుమపువ్వు, గౌస్ రకాలను సాగు చేస్తున్నారు,
అధిక దిగుబడి వద్దు మంచి ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో రైతులందరూగో ఆధారిత ప్రకృతి వ్యవసాయం తో పాటుగా అధిక పోషకాలు కలిగిన దేశవాళీ వరి వంగడాలను పండించి తినటం వల్ల శారీరక దృఢత్వం పెరగడమే గాక మనిషిలో వ్యాధినిరోధక శక్తి పెరిగి ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడే రోజులు వచ్చాయని, ప్రకృతి వ్యవసాయం లో రసాయనక ఎరువులు బదులుగా గోవు నుంచి వచ్చిన గోమాయo(పేడ) గోమూత్రం తో పాటుగా బెల్లం ,పప్పుల పిండి తో తయారు చేసిన జీవామృతం పది రోజులకు ఒకసారి నీటి ద్వారా పంపితే పంటకు అన్ని రకాల ఖనిజాలు పోషకాలు అందుతాయి అని వెంకట్రామిరెడ్డి తెలిపారు.

హరిత విప్లవం పేరుతో అధిక దిగుబడి కోసం అధిక రసాయన ఎరువులు పురుగుల మందులు వాడటం వల్ల ఈ భూమండలం పై జీవించే ప్రజలతోపాటు పశు పక్షుదులకు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి అట్లే భూమి, నీరు ,గాలి కలుషితం అవుతున్నాయి గతంలో మన పూర్వీకులు వారి జీవన విధానంలో మొదటిది పాడి అంటే పశువులను( ఆవులు గేదెలు మేకలు కోళ్లు) పోషించి వాటి ఆదాయంపై జీవించేవారు రెండవది పంట పశువుల ఎరువును భూమిక వేసి ఆ భూమి నుండి పంటను పొంది జీవించేవారు అందుకే మన పెద్దలు పాడి పంట అనేవారు ఇప్పటికైనా ప్రజలు రైతులు గుర్తించి దేశవాళి 5000 ల వరి వంగడాల లో మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 380 రకాల దేశవాళీ రకాలను రైతులు సాగుచేస్తున్నారు,
ఇప్పటికైనా రైతులు ఒక్కొక్క గ్రామానికి 10 రకాల దేశవాళీ వరి రకాలను దత్తత తీసుకొని పండిస్తే ఒక జిల్లాలోని 500 రకాల వరి వంగడాలను సంరక్షించుకోవడానికి మన భావితరాల వారికి బహుమతి గా ఇవ్వాలని వెంకట్రామిరెడ్డి కొరినారు
ఈ విధానానికి ప్రభుత్వం, వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి రైతులను ప్రోత్సహిస్తే భూసారం పెంచటమే కాక వాతావరణ కలుషితం కాకుండా నిరోధించగలమని రైతు వెంకటరామిరెడ్డి సూచించారు.
