మీడియం రేంజ్ మిస్సైల్‌ను పరీక్షించిన నేవీ
టీ మీడియా, మార్చ్ 7, వైజాగ్ : మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ను మంగళవారం ఇండియన్ నేవీ పరీక్షించింది. వైజాగ్‌లోని ఐఎన్ఎస్ విశాఖపట్టణం యుద్ధ నౌక నుంచి ఆ పరీక్షను చేపట్టింది. ఎంఆర్ఎస్ఏఎం క్షిపణులకు యాంటీ షిప్ మిస్సైళ్లను ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నట్లు నేవీ వర్గాలు వెల్లడించాయి. డీఆర్డీవో, ఐఏఐ సంయుక్తంగా ఈ క్షిపణిని డెవలప్ చేశాయి. దీన్ని బీడీఎల్ ఉత్పత్తి చేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇదే సాక్ష్యమని మంగళవారం నేవీ ఓ ప్రకనటలో తెలిపింది. ఇండియన్‌నేవీ ప్రతినిధి తన ట్విట్టర్‌లో ఈ విషయాన్ని తెలిపారు.