కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

1
TMedia (Telugu News) :

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు పంపిణీ

టీ మీడియా, జూలై 18, జన్నారం : ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో వరదల లో మునిగిపోయినటువంటి
రోటిగూడ, తిమ్మాపూర్, గ్రామాలలో సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ నాయకులు అదిలాబాద్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వెడ్మా బొజ్జు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.

Also Read : ఓటుహక్కు వినియోగించుకొన్న సిఎం కేసీఆర్

ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతు ముప్పు గ్రామాల్లో ఇప్పటివరకు ప్రజల కష్ట సమయంలో ఆదుకోకపోవడం మన ఎమ్మెల్యే కే చెందుతుంది అని, పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని , ఇల్లు కూలిపోయిన వారికి వెంటనే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలి అని అందరికీ తక్షణమే నిత్యవసర సరుకులు పంపిణీ చేయాలి ఆని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధాన కార్యదర్శి ఫసిఉల్ల, మండల ఉపాధ్యక్షుడు అంబడిపెల్లి మహేష్ , గాజుల సత్తన్న , చంద్రయ్య, నీరటి కిషన్ , వార్డ్ మెంబర్ గంగన్న యాదవ్, రహీం భాయ్, యువజన కాంగ్రెస్ నాయకులు మంద రాజేష్, సాగర్ గౌడ్,ప్రదీప్, గుగ్గిలావత్ రవి నాయక్, నగేష్ , తదితులున్నారు .

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube