320 కుటుంబాలకు నిత్యావసరాలు దుస్తులు చాపలు వితరణ

320 కుటుంబాలకు నిత్యావసరాలు దుస్తులు చాపలు వితరణ

1
TMedia (Telugu News) :
320 కుటుంబాలకు నిత్యావసరాలు దుస్తులు చాపలు వితరణ
టీమీడియా, సెప్టెంబర్ 4, చింతూరు : అల్లూరి సీతారామరాజు జిల్లా, వి.ఆర్.పురం మండలం లోని రామవరం గ్రామపంచాయతీ పరిధిలో 320 వరద బాధిత కుటుంబాలకు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ఖాన్ ఆధ్వర్యంలో దుస్తులు, చాపలు,  కందిపప్పు ఇతర నిత్యావసర వస్తువులను అందజేశారు. సోమల గూడెం గ్రామంలో 120 కుటుంబాలకు, లక్ష్మీపురం, కోప్పల్లి, తెల్లవారి గుంపు వరద బాధిత గ్రామాల ప్రజలకు చెందిన 200 కుటుంబాలకు బట్టలు నిత్యావసర వస్తువులను అందజేశారు. ఈ సందర్భంగా వి.ఆర్.పురం ఎంపీపీ కారం లక్ష్మి. నాయకులు సుందరయ్య మాట్లాడుతూ వరద తాకిడికి వందల వేల సంఖ్యలో  గిరిజన గ్రామాలు నివాసాలు నేలమట్టమైనయని, ప్రభుత్వ సాయం మాత్రం అరకొరగానే ఉందని, కేవలం రెండు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు.

 

Also Read : రిటైర్డ్ పోస్టల్ సూపర్డెంట్ కి ఘన సన్మానం

వరద బాధితుల కోసం ఆయుర్వేద వైద్యులు జమాల్ఖాన్  తమ ప్రాంత ప్రజల కోసం ముస్లిం సంస్థలకు ఈ  ఈ ప్రాంత పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఆదుకోవాలని కోరుతూ రేయింబవళ్ళు ఎంతో కష్టించి దాతలు ఇచ్చిన నిత్యవసర వస్తువులను బట్టలను తన సొంత ఖర్చులతో కిట్లను తయారు చేయించి నిండు వరదల సమయంలో కూడా తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పడవలపై ప్రయాణించి ఆదుకున్న ఆప్తమిత్రుడు అని అతని స్ఫూర్తిగా తీసుకొని మరెందరో దాతలు ముందుకు రావాలని ఆపన్న హస్తం అందించాలని కోరినారు. ఆదివాసీలు ఆరుగాలం కష్టించి గాదే లో దాచుకున్న తిండి గింజలు కూడా వరద పాలై విలవిల లాడుతున్న సమయంలో బియ్యం కొవ్వొత్తులు అగ్గిపెట్టెలు మంచి నూనె కందిపప్పు వంటి నిత్యావసరాలు అందించి అన్నార్తుల ఆకలి వచ్చిన ఆయుర్వేద వైద్యులు సేవలు మరువలేనివని అన్నారు. ఈ కార్యక్రమంలో చింత రేగు పల్లి సర్పంచ్ పిట్టా రామారావు,లక్ష్మయ్య. గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube