నేడు శ్రావణశుక్రవారం

వరలక్ష్మి వ్రతం పూజ

1
TMedia (Telugu News) :

నేడు శ్రావణశుక్రవారం
-వరలక్ష్మి వ్రతం పూజ
టీ మీడియా,ఆగస్ట్ 5, హైదరాబాద్: వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటినిశుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజా మందిరంలో ఒక మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి. ఈ మండపం పైన బియ్యపు పిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటుచేసుకోవాలి. అమ్మవారి ఫొటో అమర్చు కోవాలి. పూజాసామగ్రిని అంతా సిద్ధం చేసుకోవాలి. తోరాలు ముందుగానే సిద్ధం చేసుకునిఉంచాలి. అక్షతలు, పసుపు గణపతిని సిద్ధంగా ఉంచు కోవాలి.
కావలసినవి
పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరములు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపుకుందులు, ఐదువత్తులతో, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు మొదలైనవి.

 

Also Read : నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో హ‌వాలా లావాదేవీలు.

తోరం ఎలా తయారుచేసుకోవాలి .
తెల్లటి దారాన్ని తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపురాసుకోవాలి. ఆ దారానికి తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి, తొమ్మిదో పువ్వులతో తొమ్మిది ముడులతో తోరాలను తయారుచేసుకుని, పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి, తోరాలను పూజించి ఉంచుకోవాలి. ఆవిధంగా తోరాలనుతయారుచేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి. వరలక్ష్మీ వ్రత కథ: (అక్షింతలు చేతిలో వేసుకొని, కథను భక్తి శ్రద్దలతో వినాలి)
రమ్యమైన కైలాస పర్వతంలో ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు వినోదముగ పాచికలాడు చుండిరి. పార్వతి గెలిచినది. పరమ శివుడుపరాజితుడైనాదు. నేను గెలిచినంటే నేను గెలిచానన్న వివాదము వారిద్దరి మధ్య తలయెత్తెను. సమీపమందున్న చిత్రనేమినడుగగా ఆతడు శివునిదే జయమనెను. కోపితురాలై గౌరి అసత్యమాడిన చిత్రనేమిని కుష్ఠురోగివై భూలోకమున సరోవరతీరంలో పడిపొమ్మని శపించెను. క్షమింపుమని వేడి శాపావసానము నడిగెను. ప్రసన్నురాలైన పార్వతి, యే దినమున అప్సరకాంతలు ఆ అసరోవరతీరంలో వరలక్ష్మీ వ్రతము చేయుదురో ఆ దినమున నీవా వ్రతమును చూచి శాపవిముక్తిని పొందెదవనెను. అదే విధముగ చిత్రనేమి శాపవిముక్తుడై కైలాసము చేరుకొనెను.మఱియు మగధదేశమున పూర్వము కుండిన మనునగరముండెను. అందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ నివసించుచుండెను. ఆమె తన భర్తనే దైవముగ తలచి సేవించుచుండెను. త్రికరణ శుద్దిగల ఆ పతివ్రతామతాల్లిపై అనుగ్రహభావము గల్గి మహాలక్ష్మి ఒకనాటి రాత్రి స్వప్నమున సాక్షాత్కరించి “నేను వరలక్ష్మీదేవిని శ్రావణశుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారమునాడు నీవు వరలక్ష్మీ వ్రతమును చేయుమని, ఆ వ్రతవిధానమును చెప్పి నీకు సర్వవిధ సౌభాగ్యములు కలుగుగాక” అని ఆశీర్వదించుచు అంతర్ధానమయ్యెను. చారుమతి మేల్కుని సంతోషముతో తనకు కల్గిన స్వప్నమును పెద్దలందరికి చెప్పు శ్రావణ అందరు శుక్రవారము కొఱకై యెదురుచూచుచుండెను.

 

Also Read : ఆంధ్రా వర్సిటీ విద్యార్థిని ఛరిష్మా కృష్ణకు మిస్ సౌత్ ఇండియా కిరీటం

 

శ్రావణ పూర్ణిమకు ముందున్న శుక్రవారము రాగా చారుమతి మున్నగు స్త్రీలందరు కలుసుకొని మిక్కిలి భక్తితో స్నానాదులు ముగించుకొని ఇంటిని గోమయముతో సుద్దిచేసి మంటపము నేర్పరచి, రంగవల్లులతో అలంకరించిఅను శ్లోకముచే ధ్యానావాహనాదిషోడశోపచార పూజలు చేసి నవసూత్ర తోరము కట్టుకొని భక్తితో వరలక్ష్మికి ప్రదక్షిణము చేసిరి. మొదటి ప్రదక్షిణము చేయగానే ఘల్లుఘల్లుమను శబ్దము వచ్చెను. అందరి కాళ్లకు గజ్జెలు కట్టబడియుండెను. అంతయు వరలక్ష్మి కటాక్షమని తలంచి రెండవ ప్రదక్షిణము చేసిరి. తమ అము చేసిరి. స్త్రీలు అందరూ సర్వాభరణ భూషితలైరి. చారుమతి మొదలగు స్త్రీల గృహములన్నియు స్వర్ణమయములై రథగజతురగవాహనములతో నిండిపోయెను. చారుమతి మొదలగు స్త్రీలందరు బ్రాహ్మణులకు వాయనములిచ్చిరి. ఆశీర్వాదము తీసుకొని ప్రతి సంవత్సరము అందరు అత్యంత శ్రద్ధాభక్తులతో వరలక్ష్మీ వ్రతము నాచరించుచు సర్వవిధ సౌభాగ్యములు బొంది సుఖించిరి. ఈ వ్రతమును పరమేశ్వరుడు పార్వతికి ఉపదేశించెను. వరలక్ష్మీ వ్రతము సర్వ సంపత్కరమే కాక సర్వకార్యసిద్దిని కలుగజేయును.అక్షింతలు అమ్మవారిపై వేసి అందరి మీద వేసుకొని ప్రసాదం స్వీకరించాలి.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube